Ananya Nagalla: నడుము అందాలతో ఆకర్షిస్తున్న ‘వకీల్ సాబ్’ బ్యూటీ.. వైరల్ అవుతున్న అనన్య నాగళ్ళ లేటెస్ట్ ఫోటోలు!

  • December 21, 2022 / 07:37 PM IST

అనన్య నాగళ్ళ.. ‘మల్లేశం’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ‘ప్లే బ్యాక్’ చిత్రంలో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది. అయితే ఈమెకు భీభత్సమైన క్రేజ్ ను తెచ్చిపెట్టిన సినిమా మాత్రం ‘వకీల్ సాబ్’ అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ మూవీలో ఆమె దివ్య నాయక్ అనే గిరిజన యువతిగా కనిపించింది. ఈ సినిమా తర్వాత ఆమె వరుస ఆఫర్లతో దూసుకుపోవడం గ్యారెంటీ అని అంతా అనుకున్నారు.

కానీ కట్ చేస్తే ఈమె చేతిలో పెద్దగా ఆఫర్లు లేవు. నితిన్ నటించిన ‘మ్యాస్ట్రో’, అల్లు శిరీష్ నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ వంటి చిత్రాల్లో గెస్ట్ రోల్స్ చేసింది కానీ లీడ్ రోల్స్ మాత్రం ఈమెకు దక్కడం లేదు. దీంతో ఈమె వంతు గ్లామర్ షో చేస్తూనే ఉంది. అనన్య ఇన్స్టా ఖాతాకి 1 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉండడంతో నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తుంది. ఆ ఫోటోలు వెంటనే వైరల్ అవుతున్నాయి కానీ వాటి వల్ల ఈమె లబ్ధి పొందడం లేదు.

ఈమెకు ఆశించిన బ్రేక్ ఎప్పటికి వస్తుందో తెలీదు కానీ.. పెద్ద సినిమాల్లో మంచి పాత్రలు వచ్చే వరకు ఈమె ఇలా గ్లామర్ ఫోటో షూట్లు చేస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూనే ఉంటుంది అని కుర్ర కారు కామెంట్లు పెడుతున్నారు. ఈమె లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus