డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

ఏ సినిమాకి అయినా విడుదలైన మొదటి 3,4 రోజుల కలెక్షన్లు అంటే మొదటి వీకెండ్ కలెక్షన్లు చాలా కీలకం. మొదటి వీకెండ్ కు ఎక్కువ స్క్రీన్స్ దక్కుతాయి కాబట్టి… బ్రేక్ ఈవెన్ అవుతుందా ? లేదా? అనే విషయాన్ని అంచనా వేయగలిగేది వీటిని బట్టే.! వీక్ డేస్ లో అయితే… ఎలాగూ వర్కింగ్ డేస్ కాబట్టి ఆక్యుపెన్సీలు… ఎక్కువ ఉండవు. కాబట్టి వీక్ డేస్ లో కలెక్షన్స్ తగ్గుతాయి .కాబట్టి రెండో వీకెండ్ వచ్చేవరకు అవి పికప్ అవ్వడం కష్టం. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే..

పెద్ద సినిమాలతో పోలిస్తే చిన్న, మీడియం రేంజ్ సినిమాలకి కొన్ని అడ్వాంటేజ్ లు ఉన్నాయి. ఈ సినిమాలకి బిజినెస్ పెద్ద సినిమాల్లా భారీ స్థాయిలో జరగదు. కాబట్టి ఏమాత్రం హిట్ టాక్ వచ్చినా వీకెండ్ కే ఎక్కువ కలెక్షన్లు రాబట్టే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ ఏడాది కొన్ని చిన్న, డబ్బింగ్ సినిమాలు వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించి షాకిచ్చాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) డిజె టిల్లు :

సిద్దు జొన్నలగడ్డ , నేహా శెట్టి జంటగా నటించిన ఈ మూవీ ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రూ.9 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం వీకెండ్ ముగిసేసరికే రూ.9.2 కోట్ల షేర్ ను రాబట్టి హిట్ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫుల్ రన్ లో రూ.16.77 కోట్ల షేర్ ను రాబట్టి.. బిగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

2) మేజర్ :

అడివి శేష్ హీరోగా శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం రూ.15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. వీకెండ్ కే రూ.19 కోట్ల షేర్ ను సాధించి సూపర్ హిట్ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫుల్ రన్లో రూ.32 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది.

3) విక్రాంత్ రోణ :

సుదీప్ హీరోగా నటించిన ఈ మూవీ రూ.1.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి రెండు రోజులకే ఆ టార్గెట్ ను పూర్తి చేసింది. ఫుల్ రన్లో రూ.4.05 కోట్ల షేర్ ను రాబట్టి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

4) బింబిసార :

కళ్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ రూ. 16 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి వీకెండ్ కే ఆ టార్గెట్ ను పూర్తిచేసింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ రూ.37.92 కోట్ల షేర్ ను రాబట్టింది.

5) బ్రహ్మాస్త్రం :

రణబీర్ కపూర్ హీరోగా అలియా భట్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ మూవీ రూ.4.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి రెండు రోజులకే ఆ టార్గెట్ ను రీచ్ అయ్యింది. ఫుల్ రన్ లో ఈ మూవీ రూ.12.62 కోట్ల షేర్ ను రాబట్టింది.

6) కాంతార :

రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ నిర్మించిన ఈ మూవీ రూ.2 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ ఏకంగా రూ.27.97 కోట్ల షేర్ ను రాబట్టి ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

7) మసూద :

తిరువీర్ , సంగీత , బాంధవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ రూ.1.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి వీకెండ్ కే ఆ టార్గెట్ ను ఫినిష్ చేసింది. ఇంకా ఆ మూవీ డీసెంట్ కలెక్షన్స్ రాబడుతూనే ఉంది.

8) లవ్ టుడే :

ప్రదీప్ రంగనాథన్..నటించి, నిర్మించిన ఈ మూవీ రూ.2.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇంకా డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది.

9) హిట్ 2 :

అడివి శేష్ హీరోగా నటించిన ఈ మూవీ రూ.13.25 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇప్పటికీ డీసెంట్ కలెక్షన్స్ ను రాబడుతోంది.

కార్తికేయ2, సీతా రామం, విక్రమ్ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి కానీ వీకెండ్ కు బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాలు కాదు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus