2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

టాలీవుడ్‌లో కొద్ది రోజుల నుండి స్టార్ హీరోల పుట్టిన రోజులు, బెంచ్ మార్క్ ఇయర్స్‌కి సూపర్ హిట్ సినిమాల స్పెషల్ షోలు వేయడం.. ఫిలిం నుండి డిజిటల్‌లోకి కన్వర్షన్ చేయించి పాత చిత్రాలను మళ్లీ రీ రిలీజ్ చేయడం అనే ట్రెండ్ నడుస్తోంది.. ఈ 2022లో మాత్రం మళ్లీ విడుదల హంగామా కాస్త ఎక్కువగానే ఉంది.. ఈ ఏడాది రీ రిలీజ్ అయ్యి.. బాక్సాఫీస్ బరిలో సందడి చేసిన సినిమాల విశేషాలు ఇప్పుడు చూద్దాం..

1. పోకిరి – 4K – రూ. 2.10 కోట్లు..

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు (ఆగస్టు 9) సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ ‘పోకిరి’ మూవీని రీ రిలీజ్ చేశారు. ఈ ఫిలింతోనే రీ రిలీజ్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయిందని చెప్పొచ్చు.. రూ. 2.10 కోట్లు వసూళ్లు రాబట్టింది..

2. జల్సా – గ్రాస్ : రూ. 3.2 కోట్లు..

‘పోకిరి’ రెస్పాన్స్ చూసి.. ‘జల్సా’ రీ మాస్టర్డ్ వెర్షన్ రీ రిలీజ్ చేయాలని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఒత్తిడి చేయడంతో.. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్‌డేకి ‘జల్సా’ రీ రిలీజ్ చేయగా.. రూ. 3.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది..

3. తమ్ముడు..

‘జల్సా’ తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం ‘తమ్ముడు’ మూవీని థియేటర్లలో కూడా రీ రిలీజ్ చేశారు..

4. ఘరానా మొగుడు..

మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు కలయికలో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఘరానా మొగుడు’.. చిరు జన్మదినం నాడు ఆగస్టు 22న రీ రిలీజ్ అయింది..

5. చెన్నకేశవ రెడ్డి..

2021లో ‘చెన్నకేశవ రెడ్డి’ 19 సంవత్సరాల సందర్భంగా ఫ్యాన్స్ డిజిటల్‌లోకి కన్వెెర్ట్ చేయించిన ప్రింటుతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్పెషల్ షోలు వేశారు.. భారీ డిమాండ్ నేపథ్యంలో రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ నిర్మాత రీ రిలీజ్ చేశారు.. రూ. 5.3 కోట్లు కలెక్ట్ చేసి ఆశ్చర్యపరిచింది.. ఈ ఏడాది బాలయ్య తనయుడు మోక్షజ్ఞ బర్త్‌డే (సెప్టెంబర్ 6) కి కూడా షోలు వేశారు..

6. వర్షం – 4K – రూ. 50 లక్షలు+..

ప్రభాస్, త్రిషల బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ‘వర్షం’ 4K వెర్షన్ (బర్త్‌డే నాడు అక్టోబర్ 23.. అలాగే ప్రభాస్ హీరోగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నవంబర్ 11న) రీ రిలీజ్ అయింది..

7. బిల్లా – 4k..

ప్రభాస్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బిల్లా’ ను పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న రీ రిలీజ్ చేశారు..

8. 3..

ధనుష్, శృతి హాసన్ నటించిన లవ్ అండ్ ఎమోషనల్ మూవీ ‘త్రీ’ (3) కూడా రీ రిలీజ్ చేశారు..

9. నువ్వే నువ్వే..

హీరోలతో పాటు డైరెక్టర్ల ట్రెండ్ స్టార్ట్ అయిందీ సినిమాతో.. త్రివిక్రమ్ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘నువ్వే నువ్వే’ ను రీ మాస్టర్డ్ చేసి తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేశారు..

10. బాద్‌షా..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘బాద్‌షా.. మూవీని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ రీ రిలీజ్ చేశారు..

11. మాయాబజార్..

తెలుగు ఇండస్ట్రీలోని ఎవర్ గ్రీన్ కల్ట్ క్లాసిక్స్‌లో ఒకటిగా నిలిచిన మాస్టర్ పీస్ ‘మాయాబజార్’ రీ మాస్టర్డ్ వెర్షన్ మొదట 2010లో రీ రిలీజ్ చేశారు.. డిసెంబర్ 9న కొన్ని థియేటర్లలో రీ రిలీజ్ అయింది..

12. ప్రేమదేశం..

90’s క్లాసిక్ లవ్ స్టోరీ ‘ప్రేమదేశం’ కూడా డిసెంబర్ 9న కొన్ని థియేటర్లలో రీ రిలీజ్ అయింది..

13. శివాజీ – 4K..

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ పుట్టినరోజు సందర్భంగా ‘శివాజీ’ చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు..

14. బాబా..

రజినీ కాంత్ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 10న వరల్డ్ వైడ్ ‘బాబా’ రీ మాస్టర్డ్ వెర్షన్ విడుదల చేశారు..

15. అదిరింది..

దళపతి విజయ్ హీరోగా 30 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ‘అదిరింది’ స్పెషల్ షోలు పడ్డాయి..

16. నారప్ప..

పాండమిక్ వల్ల డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయిన ‘నారప్ప’ మూవీని డిసెంబర్ 13న విక్టరీ వెంకటేష్ బర్త్‌డే నాడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రీ రిలీజ్ చేశారు.. (థియేటర్లలో రిలీజ్ అని చెప్పొచ్చు)..

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus