హీరోయిన్ అంజలికి పెళ్లి కుదిరిందా? సోషల్ మీడియాలో ఇదే టాక్ వినిపిస్తోంది. చేతులకు మెహందీ పెట్టుకుని పోజిలిచ్చేసరికి ఇదే అనుకుంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం? తెలుగమ్మాయిలకు టాలీవుడ్ లో హీరోయిన్ గా సక్సెస్ రేట్ చాలా తక్కువ. అందుకే ఇతర భాషల్లో హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటూ ఉంటారు. అలా స్టార్ అయన నటి అంజలి. ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి మూవీతో యమ క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పటికీ సింగిల్ గానే ఉంది. కొన్నిసార్లు పెళ్లి రూమర్స్ వచ్చినప్పటికీ అందులో నిజం లేకపోయేసరికి అందరూ రిలాక్స్ అయిపోయారు.
అలాంటిది ఇప్పుడు చేతులకు మెహందీతో కనిపించేసరికి అంజలి పెళ్లికి రెడీ అయిందా అనే న్యూస్ వైరల్ గా మారింది. ఇక విషయానికొస్తే వెళ్తే.. రాజోలు పుట్టిపెరిగిన అంజలి నటిగా టాలీవుడ్ లోనే ఫస్ట్ ఎంట్రీ ఇచ్చింది. ‘ఫొటో’, ‘ప్రేమలేఖ రాశా’ మూవీస్ చేసింది గానీ పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో తమిళంలోకి వెళ్లిపోయింది. ‘షాపింగ్ మాల్’ అనే డబ్బింగ్ మూవీతో టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకుంది. ‘జర్నీ’ అనే మరో డబ్బింగ్ సినిమాతో దాన్ని డబుల్ చేసుకుంది.
ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి.. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చేసింది. ఇందులో సీతగా క్యూట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చి చాలామందికి ఫేవరెట్ అయిపోయింది. svsc మూవీ తర్వాత బలుపు, మసాలా, గీతాంజలి, డిక్టేటర్, నిశ్శబ్దం, వకీల్ సాబ్ మూవీస్ చేసింది. సరైనోడు, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. ప్రస్తుతం రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’లో కీ రోల్ చేస్తోంది. ఇలా కెరీర్ పరంగా బాగానే ఉండటంతో పెళ్లికి దూరంగా ఉంది.
గతంలో ఓ తమిళ హీరోతో డేటింగ్ వార్తలొచ్చాయి కానీ అది నిజమో కాదో తెలీదు. అలాంటిది ఇప్పుడు సడన్ గా మెహందీతో కనిపించేసరికి పెళ్లికి రెడీ అయిందేమో అనుకున్నారు. కానీ ఈ మధ్య తమిళ న్యూయర్ సందర్భంగా ఇలా ఫొటోలకు పోజిలిచ్చినట్లు తెలుస్తోంది. సో అదన్నమాట విషయం. ఈ ఫొటోలు చూసిన కొందరు నెటిజన్స్.. అంజలికి పెళ్లి కుదిరిందని అనుకున్నారు. మరి అంజలి సీత క్యారెక్టర్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం? కింద కామెంట్ చేయండి.