‘క్యాస్టింగ్ కౌచ్ ’.. శ్రీదేవి, నిత్యా మేనన్, భూమికల పై అపూర్వ సంచలన వ్యాఖ్యలు!

క్యాస్టింగ్ కౌచ్… ఇప్పుడు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్కర్లేని పదం. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా చాలా ఇండ‌స్ట్రీల‌ను ప‌ట్టి పీడిస్తున్న ఓ మ‌హ‌మ్మారి ఇది. అవ‌కాశాల కోసం హీరోయిన్ల‌ను ప‌డ‌క‌గ‌దికి పిలిపించుకోవడాన్నే క్యాస్టింగ్ కౌచ్ అంటారు. ఇప్పుడు ప్రతి ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్లు, మహిళా ఆర్టిస్టులు, మోడళ్లు, యాంకర్లు ఇలా మొత్తం ప‌ని గ‌ట్టుకుని మ‌రీ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్నారు. ఎందరో అమ్మాయిలు ఈ క్యాస్టింగ్ కోచ్ వలలో చిక్కినవారే.

కొందరికీ దీని వల్ల అవకాశాలు దొరికితే.. మరికొందరి జీవితాలే నాశనమయ్యాయి. తాజాగా ఈ క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు నటి అపూర్వ.మనల్ని కమిట్‌మెంట్ అడిగిన వ్యక్తి.. నిజంగా ఛాన్స్ ఇస్తారు అని మనకు అనిపిస్తే అందుకు సిద్ధపడొచ్చంటూ నిర్మోహమాటంగా చెప్పేశారు అపూర్వ. అయితే క్యాస్టింగ్ కౌచ్ ఎదురైనా అవకాశాల కోసం లొంగిపోకుండా స్వయంకృషి, ప్రతిభతో స్టార్ డమ్ సంపాదించిన వాళ్లు నిత్యమీనన్, శ్రీదేవి, భూమిక లాంటి వాళ్లు కూడా ఇండస్ట్రీలో వున్నారని అపూర్వ గుర్తుచేశారు.

ఏదైనా మనకు గుర్తింపు దక్కడానికి ఒక్క హిట్ చాలని.. అప్పుడే పరిశ్రమే అవకాశాల కోసం మన చుట్టూ తిరుగుతుందని ఆమె చెప్పారు. ఒకప్పుడు శ్రీదేవి సైతం ఎన్నో ఇబ్బందులు పడ్డారని.. కానీ ఒకే ఒక్క హిట్ పడ్డాక, బడా ప్రొడ్యూసర్లు ఆమె ఇంటి ముందు క్యూకట్టారని అపూర్వ గుర్తుచేశారు. తన 18 ఏళ్ల సినీ ప్రస్థానంలో తనకు రెండు సార్లు క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందని.. అయితే తాను ఒప్పుకోకపోవడంతో ఒక సినిమా నుంచి తీసేశారని ఆమె వెల్లడించారు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus