Dimple Hayathi: సక్సెస్ కోసం వేణు స్వామితో పూజలు చేయించిన నటి?

ప్రముఖ ఆస్ట్రాలజర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి ఈ మధ్యకాలంలో సంచలనంగా మారుతున్నారు. ఈయన తరచూ సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలను రాజకీయ నాయకుల జాతకాలను చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇలా ఈయన చెప్పే వ్యాఖ్యలు కూడా నిజం కావడంతో ఈయనని నమ్మే వారి సంఖ్య కూడా అధికమవుతుంది. ఇలా వేణు స్వామి చెప్పిన వ్యాఖ్యలు నిజమవడంతో చాలామంది సెలబ్రిటీలు ఈయనతో తమ జాతకాలు చూయించుకుంటూ ఏవైనా జాతక దోషాలు ఉంటే కనుక పరిహారాలు చేయించుకుంటున్నారు.

ఇప్పటికే రష్మిక నిధి అగర్వాల్ వంటి సెలబ్రిటీలు స్వామి సమక్షంలో పెద్ద ఎత్తున పూజలు చేయించుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ ఇద్దరి బాటలోనే మరొక నటి కూడా పయనిస్తోందని తెలుస్తుంది. అందం అభినయం మంచి నటన నైపుణ్యం ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నటువంటి నటి డింపుల్ హైయతి తాజాగా వేణు స్వామి చేత ప్రత్యేక పూజలు చేయించారని తెలుస్తుంది.

ఈమె రామబాణం,కిలాడి వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ రెండు సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి.అయితే కొద్ది రోజుల క్రితం పోలీస్ ఆఫీసర్ తో పెద్ద ఎత్తున గొడవ చోటు చేసుకోవడంతో వివాదాలలో కూడా చిక్కుకున్నారు. ఇలా ఈమె వివాదాలలో చిక్కుకోవడానికి ఆమె జాతక దోషాలు కారణమని తెలియడంతో వేణు స్వామి చేత ప్రత్యేక పూజలు చేయించారని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ పూజకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇలా జాతక దోషాలు తొలగిపోవడంతో ఈమె కెరియర్ కూడా సక్సెస్ బాటలో నడుస్తుందని చాలా నమ్మకంతోనే ఈ పూజలు చేయించారని తెలుస్తోంది. మరి ఇకపై ఈమె అవకాశాలు అందుకొని ఇండస్ట్రీలో సక్సెస్ సాధించేనా లేదా అనే విషయం తెలియాల్సింది.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus