గుట్టు రట్టు చేసిన నటి.. ఏమైందంటే..?

సినిమాల్లో నటించే నటీమణులకంటే.. సీరియల్స్ లో నటించే నటీమణులకి ఇంకా క్రేజ్ ఎక్కువ. ఎందుకంటే సీరియల్స్ లో నటించే వారు వారానికి 5 రోజులూ ప్రేక్షకులకు కనిపిస్తూనే ఉంటారు. ఈ లిస్ట్ లో సమీరా షరిష్‌ కూడా ఒకరు. 2006లో ప్రారంభమైన ‘ఆడపిల్ల’ సీరియల్‌తో ఈమె ప్రేక్షకులకు పరిచయమైంది.అటు తర్వాత వచ్చిన అభిషేకం, భార్యామణి వంటి సీరియళ్లతో ఈమె బాగా పాపులర్ అయ్యింది. తెలుగులో ఎన్ని ఛానల్స్ అయితే ఉన్నాయో, అన్ని ఛానల్స్ లో టెలికాస్ట్ అయ్యే సీరియల్స్ లో ఈమె నటించింది.

అదే టైంలో ఈమె తమిళంలో కూడా ఎంట్రీ ఇచ్చింది. అక్కడి సీరియల్స్ తో కూడా ఈమె బాగా పాపులర్ అయ్యింది. కొన్నాళ్ళు గడిచాక ఈమె సయ్యద్‌ అన్వర్‌ అహ్మద్‌ను పెళ్లి చేసుకుంది.2015 లో వీరి పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఓ బాబు కూడా ఉన్నాడు..! ఇప్పుడు పలు సీరియళ్లలో నటిస్తూనే టీవీ షోలలో కూడా ఈమె సందడి చేస్తుంది. ఇదిలా ఉండగా.. సమీరని ఇటీవల కొంతమంది లేడీ నెటిజన్లు టార్గెట్ చేసి విసిగిస్తున్నారు.

అయినా ఈమె ఓపికగా వారికి సమాధానాలు చెబుతూ వస్తోంది. అయితే ఇటీవల ఓ నెటిజన్.. ‘మీకు సంబంధించిన అలాంటి వీడియో పంపండి’ అంటూ కామెంట్ పెట్టింది. దీనిపై సమీర స్పందిస్తూ.. ‘‘నీకు ఇలాంటి ఆలోచన ఉన్నందుకు బాధగా ఉంది’ అంటూ సమాధానం ఇచ్చి సరిపెట్టింది. మరో మహిళ ‘ఆమె చెప్పింది నిజమే.. నువ్వు అలాంటిది కూడా చేస్తావు’ అంటూ కామెంట్ పెట్టింది. దీని పై సమీర స్పందిస్తూ….

“ఉదయ లీలకు కూడా ప్రేమ అవసరం. ఆడవాళ్లతో వచ్చిన చిక్కే ఇది.. ఎప్పుడూ ఇంకో ఆడదాన్ని కిందకు లాగాలని చూస్తూ ఉంటారు’’ అంటూ ఉదయ లీల కామెంట్లకు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ ను పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ పోస్ట్ వైరల్ అవుతుంది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus