బెల్లీ డాన్స్ తో కుర్రాళ్ళ మతిపోగొడుతున్న ఫరియా.. వైరల్ అవుతున్న వీడియో!

  • March 15, 2023 / 05:58 PM IST

‘జాతి రత్నాలు’ చిత్రంలో చిట్టిగా నటించి మెప్పించింది ఫరియా అబ్దుల్లా.మొదటి చిత్రంతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుని బిజీ అయిపోయింది. ఫరియా కంటే ఆ చిత్రంలోని పాత్ర పేరు చిట్టి గానే ఈమె ఎక్కువగా ఫేమస్ అయ్యిందని చెప్పాలి. ఆ చిత్రంలో అమాయకంగా కనిపిస్తూనే మరోపక్క లాయర్ గా కోర్టులో ఈమె చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. ‘ఇచ్చేయండి సార్ బెయిల్ ఇచ్చేయండి’ అంటూ జడ్జి బలవంతరావు(బ్రహ్మానందం) తో ఈమె పలికే డైలాగ్ పై బోలెడన్ని మీమ్స్ వచ్చాయి.

థియేటర్లో కూడా ఈమె కామెడీకి జనాలు సీట్లలో కూర్చోకుండా చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఆ సినిమా హిట్ అవ్వడంతో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ‘బంగార్రాజు’ ‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’ అనే సినిమాల్లో ఛాన్స్ కొట్టింది. సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ బెల్లీ డ్యాన్స్ తో, మతిపోగొట్టే స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటుంది అన్న సంగతి తెలిసిందే.

తాజాగా మరోసారి ఈమె తన హాట్ లుక్స్ తో, చిలిపి పనులతో డ్యాన్స్ చేసి కుర్రాళ్ల మతిపోగొట్టి ఫిదా చేసింది. బ్లాక్ డ్రెస్సులో మరో అమ్మాయితో కలిసి ఓ ఫోటో షూట్ లో పాల్గొంటున్న సమయంలో తన మార్క్ అల్లరిని చూపించింది. ఆ అమ్మాయిని ఎత్తుకుని సరదాగా ఆటపట్టించింది. ఈ లుక్ లో ఫరియా అబ్దుల్లా చాలా హాట్ గా ఉంది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus