రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!

  • March 3, 2023 / 07:00 PM IST

2022 పోయి…2023 లోకి అడుగు పెట్టేసాం…పెట్టడమే కాదు మూడు నెల కూడా ముట్టింది. ఈ మూడు నెలల్లో ఎం చేసామో…ఎంత సేవ్ చేసామో తెలియదు ఎన్ని సినిమాలు చూసాము…ఎంత ఖర్చు పెట్టాం అనేది మాత్రం గుర్తు ఉంది. సినిమాలు అంటే అల ఉంటది…

సినిమాల విషయానికి వచ్చం కాబట్టి…హీరో-హీరోయిన్స్ మాత్రమే కాకుండా ఈసారి దర్శకులు అదే మన తెలుగు దర్శకుల గురించి మాట్లాడుకుందాం. తెలుగు దర్శకుల గురించి ఎం మాట్లాడతాము అంటారా ??? ఇక దేని గురించి అంది వాళ్ళ సంపాదన గురించి..మనకు మన సంపాదన కంటే అవతలి వాడికి ఎంత వస్తుంది అనేదే ముఖ్యం అందులోను మన తెలుగు అగ్ర దర్శకులది అయితే మరీను…

ఇంకెందుకు లేటు..ఈ ఆర్టికల్ లో 2023లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న10 తెలుగు దర్శకులు ఎవరో? వాళ్ళు ఎంత ఆర్జిస్తున్నారో తెలుసుకుందాం పదండి…

10. సురేందర్ రెడ్డి

సురేందర్ రెడ్డి ఈ దర్శకుడు తీసిన అతనొక్కడే, కిక్, ధ్రువ, సైరా నరసింహ రెడ్డి… సినిమాలు కమర్షియల్ హిట్స్ అయ్యాయి. ప్రస్తుతం అఖిల్ అక్కినేని తో…ఏజెంట్ సినిమా చేస్తున్న సురేందర్ రెడ్డి ఒక సినిమాకి గాను 5 నుండి 10 కోట్లు తీసుకుంటున్నాడు.

9. సందీప్ రెడ్డి వంగ

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ని…కబీర్ సింగ్ తో బాలీవుడ్ ని షాక్ చేసిన సందీప్ రెడ్డి వంగ…ప్రస్తుతం రణబీర్ కపూర్ తో అనిమల్ సినిమా చేస్తున్నాడు…అండ్ ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా అనౌన్స్ కూడా చేసాడు. సందీప్ చేసింది ఒకటి రెండు సినిమాలు అయినా పారితోషకం మాత్రం రెండు అంకెల్లో అంటే 10 నుండి 15 కోట్ల వరకు తీసుకుంటున్నాడు అని టాక్.

8. పరశురామ్ బుజ్జి

గీత గోవిందం, సర్కారు వారి పాట సినిమాలతో వంద కోట్ల క్లూబ్లో జాయిన్ అయినా దర్శకుడు పరశురామ్ బుజ్జి ఇప్పుడు సినిమాకి 10 నుండి 15 కోట్లు తీసుకుంటున్నాడు.

7. బోయపాటి శ్రీను

ఊర మాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా మారిన బోయపాటి శ్రీను…సినిమాకి 20 నుండి 25 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. అఖండ హిట్ తరువాత బోయపాటి రామ్ తో సినిమా చేస్తున్నాడు.

6. అనిల్ రావిపూడి

పటాస్, రాజా ది గ్రేట్, F2 , సరిలేరు నీకెవ్వరూ & F3 లాంటి సినిమాలతో అస్సలు అపజయం లేకుండా దోసుకపోతున్న అనిల్ రావిపూడి సినిమాకి 20-25 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడు మరి.

5. వంశి పైడిపల్లి

వరుస/వారసుడు తో హిట్ కొట్టిన మహర్షి సినిమా దర్శకుడు వంశి పైడిపల్లి ఒక్క సినిమాకి 20 నుండి 25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.

4. కొరటాల శివ

తీసిన నాలుగు సినిమాల్లో మూడు పెద్ద హిట్స్ ..నాలుగో సినిమా ఆచార్య పెద్ద ప్లాప్ అయితేనేం కొరటాల హిట్ కొడితే ఎలా ఉంటాదో అందరికి తెలుసు. ప్రస్తుతం జూ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న కొరటాల సినిమాకి 25 నుండి 30 కోట్లు తీసుకుంటున్నాడు.

3. త్రివిక్రమ్ శ్రీనివాస్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అల వైకుంఠపురములో తో ఇండస్ట్రీ హిట్ కొట్టి అప్పుడు మీద ఉన్నాడు. ఇదే ఊపులో సూపర్ స్టార్ మహేష్ బాబు తో ముచ్చటగా మూడో సరి జత కట్టిన గురూజీ ఇప్పుడు ఒక్క సినిమాకి 35 నుండి 40 కోట్లు తీసుకుంటున్నాడు.

2. సుకుమార్

ఇక పుష్ప సినిమాతో సుకుమార్ తెలుగు ఇండస్ట్రీ లోనే కాదు ఇండియన్ సినిమాలో ఒక్క వెలుగు వెలిగాడు. పుష్ప 2 చేయబోయే బిజినెస్ దృష్టిలో పెట్టుకుని సుకుమార్ తన రెమ్యూనరేషన్ పెంచేసాడు …సుకుమార్ పుష్ప ౨ కి 40-50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అని టాక్.

1. ఎస్.ఎస్. రాజమౌళి

తెలుగు, ఇండియన్ సినిమాని హాలీవుడ్ వరకు తీసుకెళ్లిన దర్శక ధీరుడు…మన ఎస్ ఎస్ రాజమౌళి గారు… ఒక్క సినిమాకి 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు…ట్రిపుల్ ఆర్ తరువాత మహేష్ బాబు తో రాజమౌళి సినిమా చేస్తున్నారు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus