విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

ఇంతక ముందుతో పోలిస్తే మన తెలుగు-ఇండియన్ సినిమాలు…విదేశాల్లో ఎక్కువ మొత్తంలో బిజినెస్ చేస్తున్నాయి. అమెరికా, యూకే, మలేషియా, సింగపూర్, జపాన్ వంటి దేశాల్లో మన భారతీయుల సంఖ్య పెరగడం…అక్కడ మన సినిమాలకి బాగా కలిసి వచ్చింది.

తెలుగు సినిమాలతో పాటు కొన్ని ఇండియన్ సినిమాలు మైండ్ పోయే కలెక్షన్స్ సాధిస్తున్నాయి…అందుకు మంచి ఉదహరణ ఈ మధ్య వచ్చిన పఠాన్ & మన ట్రిపుల్ ఆర్ సినిమాలు ఇవి విదేశాల్లో రాబట్టిన కలెక్షన్స్.

అయితే పఠాన్, ట్రిపుల్ ఆర్ ఎహ్ కాదు ఇంతక ముందు నుండి పఠాన్ వరకు వచ్చిన సినిమాల్లో విదేశాల్లో ఎక్కువ మొత్తంలో వసూళ్లు రాబట్టిన టాప్ ౧౦ ఇండియన్ సినిమాల లిస్టులో ఉన్న సినిమాలేంటో ఓసారి చూసేద్దాం…

10 ధూమ్3 (2013) ఓవర్సీస్ గ్రాస్: ₹229 కోట్లు

ధూమ్ ఫ్రాంచైజ్ లో మూడో భాగం అయినా ధూమ్ త్రీ సినిమా ఇండియా తో పాటు పాకిస్తాన్, అరబ్ దేశాల్లో మంచి కలెక్షన్స్ ని రాబట్టింది.

9 హిందీ మీడియం (2017) ఓవర్సీస్ గ్రాస్: ₹239.35 కోట్లు

ఇర్ఫాన్ ఖాన్ నటించిన హిందీ మీడియం సినిమా ఇండియా కంటే ఎక్కువ విదేశాల్లో బాగా ఆడింది.

8 ఆర్.ఆర్.ఆర్(2022) ఓవర్సీస్ గ్రాస్: ₹270.3 కోట్లు

రాజమౌళి తెరకెక్కించిన ఇండియాస్ బిగ్గెస్ట్ ఆక్షన్ సినిమా ఆర్ ఆర్ ఆర్ అయితే గ్లోబల్ హిట్ గ నిలిచింది. ఇండియా తో పాటు అమెరికా, జపాన్ వంటి దేశాల్లో ఈ సినిమా అందరికి విపరీతంగా నచ్చింది… అస్కార్స్ వరకు వెళ్ళింది.

7 అంధధూన్ (2018) ఓవర్సీస్ గ్రాస్: ₹361 కోట్లు

ఆయుష్మాన్ ఖురానా నటించిన అంధధూన్ సినిమా ఎవరు ఊహించని విధంగా హిట్ కొట్టింది. జిత్ కొట్టడమే విదేశాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల లిస్టులో ఏడవ స్థానంలో నిలిచింది.

6 పీకే(2014) ఓవర్సీస్ గ్రాస్: ₹365 కోట్లు

రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన పీకే సినిమా….ఇండియా తో పాటు అమెరికా, యూకే దేశాల్లో పెద్ద మొత్తంలో కలెక్ట్ చేసింది.

5 పఠాన్ (2023) ఓవర్సీస్ గ్రాస్: ₹383 కోట్లు

ఇక ఈ మధ్య కాలంలో రిలీజ్ షారుక్ ఖాన్ సినిమా పఠాన్ అయితే బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని తిరగరాస్తూ..,,ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసింది.

4 బాహుబలి 2: ది కన్ క్లూజన్ (2017) ఓవర్సీస్ గ్రాస్: ₹393.1 కోట్లు

ఇండియన్ సినిమాని ఇంటర్నేషనల్ సినిమాకి పరిచయం చేసిన బాహుబలి 2 సినిమా, అమెరికా, యూకే, చైనా, జపాన్ వంటి దేశాల్లో పెద్ద మొత్తంలో రాబట్టింది.

3: భజ్రంగీ భాయిజాన్ (2015) ఓవర్సీస్ గ్రాస్: ₹537 కోట్లు

బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ నటించిన భజ్రంగీ భాయిజాన్ సినిమా ఇండియాతో పాటు పాకిస్తాన్, అరబ్ దేశాల్లో బాగా ఆడి కోట్లు గడించింది. ఈ సినిమాకి కథ రాజమౌళి తండ్రి అయినా విజయేంద్ర ప్రసాద్ గారు రాసారు.

2 సీక్రెట్ సూపర్ స్టార్ (2017) ఓవర్సీస్ గ్రాస్: ₹910 కోట్లు

ఆమిర్ ఖాన్ – జైరా వసీం నటించిన సీక్రెట్ సూపర్ స్టార్ సినిమా దుబాయ్, పాకిస్తాన్, అరబ్ దేశాల్లో పెద్ద మొత్తంలో వసూళ్లు చేసింది.

1 దంగల్(2016) ఓవర్సీస్ గ్రాస్: ₹1,520.55 కోట్లు

బాక్సింగ్ ద్వయం అయినా బబిత ఫోగట్-వినీష్ ఫోగట్ లా నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఇండియా లో కంటే ఎక్కువ చైనా, దుబాయ్, అమెరికాలో ఎక్కువ మొత్తంలో కలెక్ట్ చేసింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus