మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

  • March 5, 2023 / 04:41 PM IST

సినీ పరిశ్రమలో స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ ఉంటే.. ఈజీగా ఎంట్రీ ఇచ్చేయొచ్చు. ఫెయిల్ అయినా ఇక్కడ ఏదో ఒక గురవప్రదమైన పని చేసుకుని బ్రతికేయొచ్చు. ఒకవేళ టైం బాగుండి సక్సెస్ అయితే.. తక్కువ టైంలోనే టాప్ పొజిషన్ కు వెళ్లొచ్చు. సో బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఇది కలిసొచ్చే అంశం. అయితే బ్యాక్ గ్రౌండ్ ఉన్నంత మాత్రాన స్టార్స్ అయిపోవచ్చు అనేది అవాస్తవం. మొన్నీమధ్యనే ఓ ఇంటర్వ్యూలో నిర్మాత బన్నీ వాసు… ‘చిరంజీవి, అల్లు అర్జున్, రవితేజ, నాని’ వంటి వారు స్టార్స్ అయ్యారు అంటే లక్, హార్డ్ వర్క్ కలిసొచ్చి మాత్రమే కాదు.. వారిలో ఆ తపన ఉంది. వాళ్ళు స్టార్స్ అవ్వడానికి ఆ తపనే కారణమైంది’ అని అన్నారు. ఇది అసలైన నిజం. అల్లు అర్జున్ లో ఆ తపన ఉంది కాబట్టే అల్లు అరవింద్ గారు పుష్ చేయగలిగారు. కానీ శిరీష్ ను మాత్రం అల్లు అరవింద్ స్టార్ ను చేయలేకపోతున్నారు. నిజానికి బన్నీ కంటే కూడా శిరీష్ బాగా తెలివైనవాడు అని అంతా అంటారు. అయితే ఎక్కడ తేడా కొడుతోంది అంటే కచ్చితంగా చెప్పలేం. అరవింద్ గారు మాత్రమే కాదు… చాలా మంది స్టార్స్ తమ వారసుల సినీ కెరీర్ ను పట్టించుకోలేదు.. పట్టించుకోవడం లేదు. ఆ వారసులు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) అల్లు శిరీష్ :

ఇందాక చెప్పుకున్నాం కదా. అల్లు శిరీష్ రెండు, మూడు హిట్లు కొట్టాడు. కానీ ఇతన్ని పుష్ చేసే ప్రయత్నం అరవింద్ చేయడం లేదు. అప్పుడప్పుడు ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి వెళ్ళిపోతున్నాడు శిరీష్.

2) మనోజ్ :

మోహన్ చిన్న కొడుకు మనోజ్ మంచి టాలెంటెడ్ హీరో, అలాగే టేస్ట్ ఉన్న హీరో కూడా..! కానీ విష్ణుని పట్టించుకున్నట్టు మోహన్ బాబు … మనోజ్ కెరీర్ పై దృష్టి పెట్టలేదు. ఎంత డబ్బు పోతుంది అన్నా.. సినిమాని కంప్లీట్ చేసే మోహన్ బాబు.. మనోజ్ పాన్ ఇండియా సినిమా ఆగిపోయినా పట్టించుకోలేదు.

3) అభిరాం :

సురేష్ బాబు చిన్న కొడుకు హీరోగా పరిచయమవుతూ తేజ డైరెక్షన్లో ‘అహింస’ అనే సినిమా చేశాడు. ఇది చాలా రోజుల క్రితమే కంప్లీట్ అయినప్పటికీ ఇంకా రిలీజ్ కు నోచుకోలేదు. సురేష్ బాబు తలుచుకుంటే ఆ సినిమాని రిలీజ్ చేయడం క్షణాల్లో పని. కానీ ఆ దిశగా అయితే ప్రయత్నించడం లేదు.

4) హన్షిత రెడ్డి :

దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ అనే సంస్థని స్థాపించింది. అంతకు ముందు కూడా పలు సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించింది. ఇటీవల ‘బలగం’ అనే సినిమాని నిర్మించింది. దీనికి క్రిటిక్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఈ సినిమాకి దిల్ రాజు చేసిన ప్రమోషన్స్ చాలా ఆర్డినరీగా ఉన్నాయి. సినిమాని బాక్సాఫీస్ వద్ద నిలబెట్టే ప్రయత్నం ఆయన చేయడం లేదు. ఏదో ఓటీటీ డీల్ కోసం థియేటర్లలో రిలీజ్ చేసినట్లు చేశారు.

5) సుస్మిత కొణిదెల :

మెగాస్టార్ పెద్ద కుమార్తె ‘గోల్డెన్ బాక్స్ ఎంటర్టైన్మెంట్’ అనే బ్యానర్ ను స్థాపించి ‘సేనాపతి’ ‘శ్రీదేవి శోభన్ బాబు’ అనే సినిమాలను నిర్మించింది. కానీ వీటిని చిరంజీవి ప్రమోట్ చేసింది లేదు. ఆయన తలుచుకుంటే మెగా ఫ్యామిలీ ఉన్న 8 మంది హీరోలతో సినిమా సెట్ చేయించగలరు. కానీ అలా జరగలేదు.

6) సుధీర్ బాబు :

సూపర్ స్టార్ కృష్ణ గారి అల్లుడు అలాగే మేనల్లుడు, మహేష్ కు బావ ….! వాళ్ళు తలుచుకుంటే స్టార్ డైరెక్టర్లతో ఇతనికి సినిమాలు సెట్ చేయించొచ్చు. కానీ అలా చేయలేదు. సుధీర్ కూడా ఏదో చెయ్యాలి కదా అన్నట్టు సినిమాలు చేస్తున్నాడు.

7) పవన్ తేజ్ కొణిదెల :

ఇతను కూడా మెగా ఫ్యామిలీకి చెందిన వ్యక్తే. హీరోగా ఓ సినిమా చేశాడు. దాన్ని మెగా ఫ్యామిలీ పట్టించుకోలేదు. తను హీరోగా నటించిన సినిమాలో కూడా చిరంజీవి రిఫరెన్స్ లు పెట్టుకున్నాడు. అయినా వర్కౌట్ కాకపోవడంతో… చిరంజీవి నటించిన ‘ఆచార్య’ ‘గాడ్ ఫాదర్’ వంటి చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్లు వేసుకున్నాడు.

8) సాయి గణేష్ :

అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తన పెద్ద కొడుకు శ్రీనివాస్ కెరీర్ పై పెట్టిన శ్రద్ధ ఎందుకో చిన్న కొడుకు గణేష్ పై పెట్టడం లేదు. ‘స్వాతి ముత్యం’ రిలీజ్ అయితే మంచి టాక్ వచ్చినా జనాలు పట్టించుకోలేదు.. ఇక ‘నేను స్టూడెంట్ సార్’ అనే సినిమా రిలీజ్ కష్టాలు ఎదుర్కొంటున్నా.. సురేష్ ఫోకస్ చేయడం లేదు.

9) నందమూరి చైతన్య కృష్ణ :

అప్పుడెప్పుడో ‘ధమ్’ అనే సినిమాలో నటించాడు. మళ్ళీ ఓ కొత్త ప్రాజెక్టు మొదలవుతుంది. అటు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి హీరోలు కానీ ఇటు నందమూరి అభిమానులు కానీ ఇతన్ని పట్టించుకోవడం లేదు.

10) సుశాంత్ :

అక్కినేని నాగేశ్వర రావు గారి మనవడు, నాగార్జున మేనల్లుడు అయిన సుశాంత్.. గుర్తొచ్చినప్పుడు ఓ సినిమా చేసుకుంటూ వెళ్తున్నాడు. నాగార్జున తలుచుకుంటే ఇతన్ని హీరోగా నిలబెట్టొచ్చు. కానీ అతను తన కొడుకుల పై తప్ప ఇతని వైపు ఫోకస్ పెట్టడం లేదు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus