Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్ అల్లుడికి హీరోయిన్ ఫిక్స్.. ఆ కాంబో రిపీట్ చేస్తూ…
- October 2, 2026 / 02:32 PM ISTByFilmy Focus Desk
రజనీకాంత్ – అశ్వత్ మరిముత్తు కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘ధర్మన్’ అనే పేరు పెట్టారు. తెలుగులో ఇదే పేరు పెడతారా.. లేక తెలుగు కోసం ‘ధర్మ’ అనే పేరు ట్రై చేస్తారో లేదో తెలియదు. ఆ విషయం పక్కన పెడితే.. ఈ సినిమా కాస్టింగ్ గురించి కొత్తగా వచ్చిన కొన్ని వార్తలు ఆసక్తికరంగా ఉన్నాయి. రామ్ విషయమేగా.. ఆల్ రెడీ ఆయన క్యారెక్టర్ షూటింగ్ మొదలైంది కదా అనుకుంటున్నారా? ఇప్పుడు చెప్పబోయేది ఆ విషయం కాదు.
Rajinikanth
‘ధర్మన్’ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన సమాచారం చూస్తే.. ఇందులో రజనీకాంత్, సిమ్రన్, రాశీఖన్నా నటిస్తున్నారు. ఈ విషయం తప్ప ఇంకే విసయాలు చిత్రబృందం చెప్పలేదు. అయిత ఈ సినిమాలో రజనీకాంత్‌కి అల్లుడి పాత్రలో రామ్ పోతినేని నటిస్తున్నారు అని ఆ మధ్య వార్తలొచ్చాయి. అయితే ఈ విషయంలో ఇంకా ఎక్కడా క్లారిటీ లేదు. కానీ ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఓ షెడ్యూల్ షూటింగ్‌లో రామ్ కూడా పాల్గొన్నాడని సమాచారం.

అయితే, ఇప్పుడు సినిమా మైసూరులో చిత్రీకరణ జరుపుకుంటోంది. దీనికి సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ సంగతి తర్వాత చూద్దాం. ఈ షెడ్యూల్ తర్వాత మరోసారి రామ్ పోతినేని ఈ సినిమా సెట్స్‌లో అడుగుపెడతాడట. అప్పుడు శ్రీలీల కూడా ఆయనతోపాటు కలుస్తారట. మరి ఇద్దరూ పెయిర్‌గా నటిస్తారా లేక వేర్వేరు పాత్రలా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ కాంబోగా నటిస్తే రెండోసారి అవుతుంది.

గతంలో ఇద్దరూ కలసి ‘స్కంద’ సినిమాలో కలసి నటించారు. ఆ సినిమా ఫలితం ఇబ్బందికరంగా వచ్చింది. కానీ ఈ ఇద్దరి జోడీకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. కాబట్టి ఈ సినిమాకు వీరి కాంబో ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ సినిమాకు సంబంధించి ఈ అప్‌డేట్స్ ఎప్పుడు ఇస్తారో చూడాలి. ఇక పైన చెప్పిన వైరల్ వీడియో సంగతికి వస్తే.. సినిమా సెట్స్‌కి ఆటోలో వచ్చారు రజనీకాంత్. అందుకే వీడియో వైరల్ అయ్యింది.
అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్













