Actress Gopika: ఒకప్పటి హీరోయిన్ గోపిక లేటెస్ట్ ఫోటో వైరల్..!

హీరోయిన్ గోపిక తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే..! ‘యువసేన’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు అటు తర్వాత రవితేజ హీరోగా నటించిన ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్’ చిత్రంతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ మూవీలో ఓ కేరళ అమ్మాయిగా హీరో మాజీ ప్రేయసి పాత్రను పోషించి తన నటనతో ఆకట్టుకుంది. ఆ మూవీలో ‘మన్మధుడే బ్రహ్మను పూని’ అనే పాటలో చాలా చక్కగా డ్యాన్స్ చేసింది. ఆ పాట ఓ క్లాసిక్ అనే చెప్పాలి.

అటు తర్వాత ‘లేత మనసులు’ ‘ముద్దుల కొడుకు’ ‘వీధి’ ‘వీడు మామూలోడు కాదు’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. అందులో ఒక్క ‘వీధి’ మూవీ తప్ప మరే మూవీ హిట్టవ్వకపోవడంతో ఈమె మళ్ళీ తెలుగులో సినిమాలు చేయలేదు. తమిళ్, మలయాళం, కన్నడ లో కూడా ఈమె సినిమాలు చేసింది కానీ అవి కూడా పెద్దగా ఆడలేదు. దాంతో ఈమె పూర్తిగా నటనకు దూరమైంది. అటు తర్వాత సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అజిలేష్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్ళాడి..

ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యింది గోపిక. ప్రస్తుతం ఆమె ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. ఈమెకు ఇద్దరు పిల్లలు.గోపిక తన భర్త పిల్లలతో కలిసి ఉన్న ఓ ఫోటో కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus