ఐటెం సాంగ్స్, స్పెషల్ సాంగ్స్ సంస్కృతి ఇప్పటిది కాదు. 1960 ల నుండి ఉంది. సీరియస్ గా సాగుతున్న సినిమాలో స్పెషల్ సాంగ్ వస్తే.. దాన్ని జనాలు రిలీఫ్ గా ఫీలయ్యేవారు.స్పెషల్ సాంగ్స్ తో పాపులర్ అయిన నటీమణులు చాలా మందే ఉన్నారు. వారిలో బాలీవుడ్ కు చెందిన బిందు ఒకరు. దాదాపు 40 ఏళ్ళపాటు ఈమె సినీ పరిశ్రమలో నటించి, నర్తించి మంచి పేరు సంపాదించుకుంది. అయితే ఈమె తక్కువ వయసులోనే సీక్రెట్ గా పెళ్లి చేసుకుని ఆ విషయాన్ని చాలా కాలం పాటు గోప్యంగా ఉంచిందట.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న(Actress) ఆమె ఈ విషయం గురించి స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ‘మా ఎదురింట్లో ఉండే చంపక్ లాల్ జవేరీ, నేను 15 ఏళ్ల వయసులోనే ప్రేమించుకున్నాం. 18 ఏళ్లకే పెళ్లి చేసుకున్నాం. కానీ ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచాం. చాలా కాలం పాటు ఈ విషయాన్ని ఎవరికీ తెలియనివ్వలేదు. ఎందుకంటే పెళ్లి వల్ల నా వర్క్ డిస్టర్బ్ అవుతుందేమో అని భయపడ్డాను. 1979లో నాకు ‘దో రాస్తే’ సినిమాలో ఆఫర్ వచ్చింది.
‘మనం ఆర్థికంగా సెటిలయ్యాం కదా, ఇప్పుడిది అవసరమా?’ అని ఆ టైంలో మా ఆయన నాతో అన్నారు. కానీ నాకు యాక్టింగ్ అంటే ఇష్టం ఉందని చెప్పడంతో మరేం మాట్లాడలేదు. నాకు అండగా నిలబడ్డారు.నేనెప్పుడు కూడా ఒంటరిగా ఏ పార్టీకి వెళ్లలేదు. మా ఆయనతో కలిసే పార్టీలకు వెళ్లేదాన్ని. అలాగే లేట్ చేయకుండా ఇంటికి వెళ్లిపోయేవాళ్లం. నా విషయంలో ఎప్పుడూ కూడా ఆయన ఇన్ సెక్యూరిటీ లోనవ్వలేదు. నేను ఆయన్ని ఎంత ప్రేమిస్తున్నానో ఆయనకు తెలుసు. అందుకే నాపై పూర్తి నమ్మకం ఉంచారు.’ అంటూ చెప్పుకొచ్చింది బిందు.
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?