టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో బిగ్ బాస్ సీజన్ లో కూడా పాల్గొంది ఈ నటి. ప్రస్తుతం ఈమె కూతురికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. హేమ కూతురు ఇషా చాలా కాలంగా దర్శకుడు పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ తో ప్రేమలో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హేమ తన కూతురిపై వస్తోన్న వార్తలపై స్పందించింది.
తనకు దర్శకుడు పూరి జగన్నాథ్.. సోదరుడితో సమానమని అందువలనే ఆయనతో సన్నిహితంగా ఉంటానని చెప్పుకొచ్చింది. అలానే కూతురు ప్రేమ, పెళ్లి వార్తలపై స్పందిస్తూ.. అందులో నిజం లేదని, ఇప్పట్లో తమ కూతురికి పెళ్లి చేసే ఆలోచన కూడా లేదని చెప్పింది. ఒకవేళ తన కూతురు ఎవరినైనా ప్రేమిస్తే తన అభిప్రాయాన్ని గౌరవిస్తామని హేమ తెలిపింది. ఇటీవలే తన కూతురు పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకుంటానని తనతో చెప్పిన విషయాన్ని హేమ గుర్తుచేసుకుంది.
ఈ విషయాలతో పాటు పూరి జగన్నాథ్ పెళ్లి విషయంలో హేమ సహాయం చేసిన విషయంపై కూడా స్పందించారు. పూరి జగన్నాథ్ తన ఇంటి దగ్గరే ఉండేవాడని.. ఆయన గురించి అన్నీ తెలియడంతోనే ప్రేమ పెళ్లి చేసుకోవడానికి సహాయం చేశానని చెప్పుకొచ్చింది హేమ. ప్రస్తుతం పూరి ‘ఫైటర్’ అనే సినిమాను రూపొందిస్తున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబై పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నట్లు సమాచారం.