సౌత్ ఇండస్ట్రీపై హీనా హేయమైన వ్యాఖ్యలు!

  • October 28, 2017 / 06:10 PM IST

హీరోయిన్లు పబ్లిసిటీ కోసం ఏమైనా చేస్తారు అనే మాట మనం రెగ్యులర్ గా వింటూనే, చూస్తూనే ఉంటాం. అయితే.. హిందీ సీరియల్ నటి హీనాఖాన్ మాత్రం ఒక పదడుగులు ముందుకేసి.. ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీనే పబ్లిసిటీ కోసం వాడేసుకొంది. అది కూడా అసభ్యమైన పదజాలంతో. “సౌత్ ఇండస్ట్రీలో రాణించాలంటే ఎక్స్ పోజింగ్ బాగా చేయాలి, చీర కిందవరకూ జార్చి కట్టుకోవాలి” అంటూ నీచంగా, అవమానకరంగా వ్యాఖ్యలు చేసింది.

అంతే కాకుండా.. హీనాఖాన్ ను వెంకటేష్-మహేష్ బాబు హీరోలుగా రూపొందిన “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రంలో ఒన్ ఆఫ్ ది హీరోయిన్ గా ఎంపిక చేయగా ఆమె రిజెక్ట్ చేసిందని, అందుకు ఇప్పటికీ బాధపడుతుందని హీనాఖాన్ పేర్కొనడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి ఆమెను మన దర్శకనిర్మాతలు సంప్రదించడం ఎంతవరకూ నిజమో తెలియదు కానీ.. అమ్మడు చేస్తున్న హడావుడికి మాత్రం అందరికీ తెగ చిరాకొస్తుంది. ఈ రచ్చంతా బాలీవుడ్ బిగ్ బాస్ సీజన్ 11లో జరుగుతోంది. పోనీ అమ్మడు చేస్తున్న హడావిడికి ఇప్పటివరకూ ఏదైనా బాలీవుడ్ సినిమాలో యాక్ట్ చేసిందా అంటే అదీ లేదు. కేవలం హిందీ సీరియల్స్ లో నటించే హీనాఖాన్ ఈ విధమైన వ్యాఖ్యలు చేయడంపై సౌత్ ఇండస్ట్రీ హీరోయిన్స్ ట్విట్టర్ ద్వారా విరుచుకుపడుతున్నారు. చూద్దాం ఈ రచ్చ అమ్మడికి బిగ్ బాస్ లో పబ్లిసిటీ తెచ్చిపెడుతుందో లేక సౌత్ సినిమాలో అవకాశాలనేవి రాకుండా చేస్తుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus