యంగ్ హీరోలను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్న హీరోయిన్

టాలీవుడ్లో హీరోయిన్ల కొరత ఉంటుందని ఎక్కువగా చెబుతుంటారు.కానీ అదంతా ఒకప్పుడు. ఇప్పుడు హీరోయిన్ల విషయంలో అలాంటి ఇబ్బంది లేమీ లేదు. ఒకప్పుడు అంటే స్టార్ హీరోల సినిమాల్లో.. స్టార్ హీరోయిన్లే ఉండాలి అనే ఒక కాలిక్యులేషన్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ విషయంలో దర్శక నిర్మాతలు కూడా ఒక రియాలిటీకి వచ్చేశారు. స్టార్ హీరోల పక్కన స్టార్ హీరోయిన్లే ఎందుకు. 4 పాటల్లో, 6 లవ్ సీన్స్ లో కనిపించేందుకు ఏ హీరోయిన్ అయినా ఒక్కటే కదా అనే నిర్ణయానికి వారు వచ్చేశారు.

Star Actress

పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఈ మధ్య స్టార్ హీరోయిన్లు ఎవ్వరూ కనిపించడం లేదు. నామమాత్రంగా హీరోయిన్లను పెట్టుకుంటున్నారు. ప్రభాస్ ‘కల్కి 2898 ad’ ‘సలార్’ వంటి సినిమాల్లో హీరోయిన్లు ఉన్నా.. లేనట్టే అని చెప్పాలి. ఇప్పుడు ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగా చేస్తున్న ‘స్పిరిట్’ లో సైతం స్టార్ హీరోయిన్ దీపికాని తప్పించి త్రిప్తి దిమిరిని తీసుకున్నారు అంటే విషయం అర్ధం చేసుకోవచ్చు. అందుకే స్టార్ హీరోయిన్ల డిమాండ్లు ఒకప్పటిలా లేవు.

ఇక అసలు విషయానికి వస్తే.. ఒకప్పుడు టాప్ హీరోలందరికీ జోడీగా నటించిన ఓ స్టార్ హీరోయిన్.. ఇక్కడ ఆఫర్లు కరువవడంతో బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ కూడా పెద్ద సినిమాల్లో ఛాన్సులు రావడం లేదు. దీంతో టాలీవుడ్ యంగ్ హీరోలను టార్గెట్ చేసింది ఆ స్టార్ హీరోయిన్. గతంలో వారితో సన్నిహితంగా గడిపిన క్షణాలను గుర్తుచేస్తూ.. ఆ యంగ్ హీరోల సినిమాల్లో ఛాన్సులు ఇవ్వాలని డిమాండ్ చేస్తుందట. కానీ యంగ్ హీరోలకి హీరోయిన్ల విషయంలో దర్శకనిర్మాతలకు ఆదేశాలు ఇచ్చేంత సినిమా ఉండదు. అందుకే ఆ హీరోయిన్ విలవిలలాడిపోతున్నట్టు వినికిడి.

‘మాస్ జాతర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus