మాస్ మహారాజ్ రవితేజ హీరోగా స్టార్ రైటర్ భాను భోగవరపు స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మాస్ జాతర’ (Mass Jathara). ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందించాడు. ‘తుమేరా లవర్, చిలక, సూపర్ డూపర్ సాంగ్ వంటివి ఆకట్టుకున్నాయి.
సినిమాపై మాస్ ఆడియన్స్ ఫోకస్ పడేలా చేశాయి. దీంతో రవితేజ గత సినిమా ఫలితంతో సంబంధం లేకుండా థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. ఒకసారి వాటి వివరాలు అలాగే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను తెలుసుకుందాం రండి :
| నైజాం | 5.5 cr |
| సీడెడ్ | 3.0 cr |
| ఆంధ్ర(టోటల్) | 6.5 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 15 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.5 cr |
| ఓవర్సీస్ | 2.5 cr |
| టోటల్ వరల్డ్ వైడ్ | 19 కోట్లు |
‘మాస్ జాతర’ (Mass Jathara) చిత్రానికి రూ.19 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.20 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. సినిమా టీజర్, ట్రైలర్ వంటివి ఇంప్రెస్ చేశాయి. కానీ సినిమాపై బజ్ అయితే లేదు. ఈ నేపథ్యంలో ‘మాస్ జాతర’ బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? లేదా? అనేది టార్గెటెడ్ ఆడియన్స్ రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.