Jyothi Rai: ట్రోల్స్ పై స్పందించిన నటి జ్యోతి రాయ్… వైరల్ అవుతున్న పోస్ట్!

  • August 1, 2023 / 04:53 PM IST

జ్యోతి రాయ్ అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ గుప్పెడంత మనసు సీరియల్ నటి జగతి అంటే మాత్రం అందరికీ ఈమె గుర్తుకు వస్తారు. జగతి పాత్రలు ఎంతో అద్భుతంగా నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి జ్యోతి గత కొద్దిరోజులుగా తన వ్యక్తిగత కారణాల వల్ల వార్తలలో నిలుస్తున్నారు.ఈమె తన భర్తకు విడాకులు ఇచ్చి యంగ్ డైరెక్టర్ తో డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. ఇకపోతే ఈ వార్తలు నిజమేనన్నట్టుగా ఈమె కూడా తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఏకంగా జ్యోతి పూర్వజ్ అనే పేరును కూడా పెట్టారు.

ఇలా తన పేరు పక్కన డైరెక్టర్ పేరు ఉండటంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా ఈమె భర్తకు విడాకులు ఇచ్చే మరొక డైరెక్టర్ ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం పట్ల ఈమె గురించి పలు విమర్శలు ఎదురయ్యాయి. ఇలా జ్యోతి రాయ్ పట్ల చాలామంది విమర్శలు చేస్తూ తనని ట్రోల్ చేశారు. ఇలా తన గురించి తన వ్యక్తిగత విషయాల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె ఈ వార్తలపై స్పందించారు.

ఈ సందర్భంగా జ్యోతి (Jyothi Rai) డైరెక్టర్ సుఖ పుర్వజ్, తన కుమారుడితో కలిసి దిగినటువంటి ఫోటోని షేర్ చేశారు. ఇలా ఈ ఫోటోని షేర్ చేసిన ఈమె మీకు తెలియకుండా అర్థం కాకుండా ఎవరిని నిందించవద్దు. మీరు ఎవరు కూడా నా వెంట నడవలేరని గుర్తుపెట్టుకోండి అంటూ చెప్పుకొచ్చారు. ఇలా ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈమె చేసినటువంటి ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈమె తన గురించి వస్తున్నటువంటి విమర్శలపై స్పందించే ఇలాంటి పోస్ట్ చేశారని తెలుస్తుంది.

ఏది ఏమైనా డైరెక్టర్ వ్యవహారం కారణంగా ఈమె మాత్రం పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.ఈమె కెరియర్ విషయానికి వస్తే కన్నడ బుల్లితెరపై దాదాపు 20 సీరియల్స్ లో నటించి బుల్లితెర నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus