నటి కల్పిక గణేష్ (Kalpika Ganesh) 2 రోజుల క్రితం తన పుట్టినరోజు సందర్భంగా ఫ్రెండ్స్ తో కలిసి ప్రిజం పబ్ కు వెళ్ళింది. అక్కడ ఎందుకో సిబ్బందితో గొడవ పడింది. దానికి సంబంధించిన వీడియో కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఆమె పబ్బులో వాళ్ళ సామాన్లు కూడా కింద పడేసింది. బర్త్ డే కేక్ విషయంలో పబ్ స్టాఫ్ తో గొడవ జరిగినట్లు ఆమె తెలిపింది. దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఆమెను బూతులు తిట్టారని, డ్రగ్గిస్ట్ అంటూ అవమానించారని , ఈ విషయం పై గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వాళ్ళు ప్రిజం పబ్ నిర్వాహకుల కంటే దారుణం అని ఆమె వెల్లడించింది.
ఆ తర్వాత మరికొన్ని వీడియోలు బయటకు వచ్చాయి..సిబ్బంది ఆమెను వీడియోలు తీస్తుంటే.. ‘అన్ని యాంగిల్స్ లోనూ తీయండి.. నాకు కాంట్రోవర్సీ కావాలి నాయనా’ అంటూ చెప్పింది. ఈ వీడియోలు వైరల్ అవ్వడం.. కల్పిక పై నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వడంతో ఆమె స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. ” నేను నా బర్త్ డే సందర్భంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఫ్రెండ్ ను తీసుకొని ప్రిజం పబ్బుకి వెళ్లాను.
అక్కడ రూ.2 వేలకు పైగా బిల్ అయ్యింది. అయితే పబ్బుల్లో బర్త్ డేకి వెళ్తే బిల్లులో డిస్కౌంట్ ఇస్తారు. అలాగే కేక్ కాంప్లిమెంటరీ ఇస్తారు. దీనిపై వాళ్ళతో మాట్లాడాను. అందుకు కుదరదు అన్నారు. దాని విషయంలో మాట మాట పెరిగింది. తర్వాత వాళ్ళు వల్గర్ గా కామెంట్స్ చేశారు. నాకు కోపం వచ్చింది. సారీ డిమాండ్ చేశాను. అయినా వాళ్ళు తగ్గకుండా డోర్స్ క్లోజ్ చేసి.. నన్ను ఇబ్బంది పెట్టారు. మాటలతో రేప్ చేశారు. పోలీసులకు కంప్లైంట్ చేసినా వాళ్ళకే వత్తాసు పలికారు.
నాకు ఆఫర్లు లేకపోవడం వల్ల.. నేను వాళ్లపై నెగిటివ్ కామెంట్స్ చేసి కాంట్రోవర్సీ కోరుకున్నాను అని అంటున్నారు. నేను 2 పెద్ద సినిమాల్లో నటిస్తున్నాను. బిగ్ బాస్ వాళ్ళు సీజన్ 1 నుండి అడుగుతున్నారు. రాబోయే రోజుల్లో వెళ్లే అవకాశం ఉంది” అంటూ చెప్పుకొచ్చింది కల్పిక. ఇందులో నిజానిజాలు కల్పిక, ప్రిజం పబ్ వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే.. వాళ్ళ పై కూడా గతంలో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి అలాగే కల్పిక పై కూడా చాలా వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలిచింది.