Keerthy Suresh: కీర్తి సురేష్ ఆస్తి ఎన్ని కోట్లు ఉంటుందంటే..!

దీపం ఉండగానే ఇళ్లు చక్కపెట్టుకోవాలనే పెద్ద వాళ్ల మాటను తూ.చ తప్పకుండా పాటిస్తుంటారు హీరోయిన్లు.. సినిమా పరిశ్రమ అనేది గ్లామర్ ఫీల్డ్.. చేతిలో అవకాశాలున్నప్పుడే చక చకా చిత్రాలు చేసేస్తూ.. నాలుగు రాళ్లు వెనకే, బ్యాంక్‌లోనో వేసుకోవాలనే ఆరాట పడుతుంటారు.. దాదాపుగా చాలా మంది సొంతంగా ఫ్లాట్స్, స్థలాలు కొనడం లేదా ఇతర వ్యాపారాల్లో ఇన్‌వెస్ట్ చేస్తుంటారు.. తెలుగులో స్టార్ హీరోయిన్లుగా చెలామణీ అవుతూ కోట్లాది రూపాయల భారీ పారితోషికం తీసుకునే బాంబే భామలు హైదరాబాద్‌లోనూ సొంతంగా ఇళ్లుల్లు కొనేసుకున్నారు..

తాజాగా కీర్తి సురేష్ ప్రాపర్టీస్ గురించిన న్యూస్ అటు మీడియాలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.. వివరాల్లోకి వెళ్తే.. స్టార్ హీరోలకు లక్కీ ఛార్మ్‌గా మారిన కీర్తి సురేష్.. సినిమాకి రూ. 2 నుండి 3 కోట్ల రూపాయలు తీసుకుంటుందట.. భారీగా ఆస్తులు కూడ బెట్టిందట.. ఫిలిం వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ఏంటంటే.. కీర్తికి ఓవరాల్ గా అక్షరాలా రూ. 35 కోట్ల వరకు ఆస్తిపాస్తులున్నాయట.. ఆమె ఒక్కో బ్రాండ్ ప్రమోషన్స్ (ఎండార్స్‌మెంట్) కి రూ. 15 లక్షల నుండి 30 లక్షల వరకు డిమాండ్ చేస్తుందట..

ఇప్పటికే రిలయన్స్ ట్రెండ్స్, జోస్ అలుక్కాస్ వంటి సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తుంది.. కీర్తికి చెన్నైతో పాటు హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో ఓ ఖరీదైన అపార్ట్‌మెంట్ కూడా ఉందట.. కీర్తి సురేష్ త్వరలో పెళ్లి చేసుకోబోతుందట.. తన మ్యారేజ్ గురించి ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి కానీ ఈసారి ఫిక్స్ అంటున్నారు.. ప్రస్తుతం కీర్తి చేతిలో ఆరు సినిమాలున్నాయి..

చిరంజీవి చెల్లెలిగా నటిస్తున్న ‘భోళా శంకర్’ షూటింగ్ త్వరగా కంప్లీట్ చేయాలని యూనిట్‌ని కోరిందట.. మిగతా ప్రాజెక్టుల దర్శక నిర్మాతలను కూడా వీలైనంత త్వరగా తన పార్ట్ షూట్ పూర్తి చేయాలని రిక్వెస్ట్ చేస్తోందట.. అలాగే కొత్త సినిమాలేవీ కూడా కమిట్ కావడం లేదు.. నాని పక్కన నటించిన పాన్ ఇండియా ఫిలిం ‘దసరా’ మార్చి 30న భారీగా విడుదల కానుంది..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus