Actress: అందంతో, అభిమానులతో వ్యాపారం.. హీరోయిన్ వింత చేష్టలు..!

హీరోయిన్లు తమ గ్లామర్ తో సినిమా అవకాశాలు పొందుతారు అన్నది ఒకప్పటి మాట. అదే అందాన్ని అడ్డం పెట్టుకుని సోషల్ మీడియా ఖాతాల ద్వారా డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు అన్నది ఇప్పటి మాట. అయితే ఓ హీరోయిన్ ఇంకో అడుగు ముందుకేసి అందంతో వ్యాపారం మొదలు పెట్టింది. అంటే వేరే రకంగా తీసుకోకండి. ఇక్కడ చెప్పబోతున్న విషయం వేరు. మేటర్ లోకి వెళ్తే.. హీరోయిన్ కిరణ్ రాథోడ్ అందరికీ గుర్తుండే ఉంటుంది.

సీనియర్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కు ఈమె కజిన్. కరెక్ట్ గా చూస్తే కిరణ్ లో ఆమె పోలికలు కూడా ఎక్కువగానే ఉంటాయి. 2002లో విక్రమ్ హీరోగా నటించిన ‘జెమినీ’ చిత్రంతో ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం హిట్ అవ్వడంతో ఆ తర్వాత విలన్, అన్బే శివం, విన్నర్, తెన్నవన్, ఆంబళ్ వంటి పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించే అవకాశాలు దక్కించుకుంది. తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా నటించింది.

తర్వాత (Actress) ఈమెకు ఛాన్స్ లు లేక సైలెంట్ అయిపోయింది. అయితే 41 ఏళ్ల వయసులో ఈ భామ రీఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది. తన గ్లామరస్ ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో నాన్ స్టాప్ గా షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను నిద్ర లేకుండా చేస్తుంది. అక్కడితో ఆగకుండా కిరణ్ పేరుతో ఒక యాప్ ను ప్రారంభించి అభిమానులతో వ్యాపారం చేయడానికి రెడీ అయ్యింది ఈ బ్యూటీ. ఆ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలంటే రూ.49 ఖర్చు చేయాలి.

ఆ యాప్ ద్వారా రూ.1000 చెల్లిస్తే కిరణ్ తన రెండు గ్లామరస్ ఫొటోలను పంపుతుంది. అలాగే ఆమెతో 5 నిమిషాలు మాట్లాడాలంటే రూ.10 వేలు చెల్లించాలట.అదే వీడియో కాల్లో 15 నిమిషాలు మాట్లాడాలంటే రూ.14 వేలు, 25 నిమిషాలు మాట్లాడాలంటే రూ.25 వేలు చెల్లించాలట. ‘మంచి అమ్మాయిలు చరిత్రకెక్కలేరు, ధైర్యం కలవారే చరిత్ర సృష్టించగలరు’ అంటూ తన ఇన్స్టాగ్రామ్లో బోల్డ్ కామెంట్ కూడా పెట్టింది ఈ నటి.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus