టాలీవుడ్ ఇండస్ట్రీలో బేబ్బమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్న వయసులోనే హాట్ హాట్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంలో కేక పెట్టించే ఈ ముద్దుగుమ్మ ప్రెసెంట్ ఒక్క హిట్ కోసం అల్లాడిపోతుంది . తెలుగులో వరుసగా మూడు హిట్లు అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత హిట్ అన్న పదానికి దూరంగా వెళ్లిపోయింది .ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనను ఓ సినిమా షూటింగ్ లో ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది.
ఓ స్టార్ దర్శకుడి కారణంగా ఇబ్బంది పడ్డట్లు తెలిపింది. (Krithi Shetty) ఆమె మాట్లాడుతూ.. “నా మాతృభాష ‘తుళు’.. అయితే తెలుగు బాగానే మాట్లాడతాను. దీనికి కారణం ఇంతవరకూ తెలుగు బాగా తెలిసిన దర్శకులతోనే చేశాను. అయితే లింగుసామిగారి తెలుగులో తమిళ యాస ఉంటుంది. నాకు అసలు తమిళమే తెలియదు. అందువలన ఆయన మాట్లాడే తెలుగు అర్థం అయ్యేది కాదని తెలిపింది. ఇలా ఒక వారం రోజుల పాటు ఇబ్బంది పడాల్సివచ్చింది.
రామ్ గారికి తమిళం కూడా బాగా వచ్చు. అందువలన ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆయన సపోర్ట్ తీసుకున్నాను. లింగుసామి గారు ఏం చెబుతున్నారనేది నాకు రామ్ గారు చెప్పేవారు. ఇక ఆ తరువాత నేను లింగుసామి తెలుగు యాసకు అలవాటు పడిపోయానని తెలిపింది. ఇక బుచ్చిబాబు దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ‘ఉప్పెన’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది కృతి శెట్టి.
’ఉప్పెన’ సినిమాతో వచ్చిన క్రేజ్‌ను బాగానే యూజ్ చేసుకుంటోంది. తొలి సినిమా విడుదల తర్వాత కథానాయికగా కృతి శెట్టి క్రేజ్ పీక్స్‌లో ఉంది. ఈ అమ్మడు తన అందచందాలతో పాటు నటనతో ఇండస్ట్రీని ఊపేయడానికి వచ్చినట్లే ఉంది.