Kriti Shetty: సినిమా హిట్ కావాలని భారీ మొక్కు మొక్కిన బేబమ్మ.. మొక్కు ఫలించేనా?

  • September 2, 2022 / 06:31 PM IST

ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు కన్నడ ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఇలా మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన నటించిన ఉప్పెన సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. ఈ సినిమా అనంతరం కృతి శెట్టి నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. అనంతరం నాగచైతన్య నాగార్జున నటించిన బంగార్రాజు సినిమాలో నాగచైతన్యకు జోడిగా నటించారు. బంగార్రాజు సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో కృతి శెట్టి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారిపోవడమే కాకుండా ఈమెకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.

ఇలా వరుస సినిమాలకు కమిట్ అయినటువంటి ఈమెకు ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస ప్లాప్ సినిమాలు ఎదురవుతున్నాయి.ఈ క్రమంలోనే తమిళ డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వంలో ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన దివారియర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. ఇక ఈ సినిమాతో ఈమెకు వరుస ఫ్లాప్స్ మొదలయ్యాయని అర్థమవుతుంది. ఈ సినిమా అనంతరం కృతి శెట్టి నితిన్ సరసన నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా డిజాస్టర్ కావడంతో

ఇండస్ట్రీలో ఈమె పని అయిపోయిందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇకపోతే త్వరలోనే కృతి శెట్టి సుదీర్ బాబు నటించిన ఆ అమ్మాయి గురించి చెప్పాలి సినిమా విడుదల కానుంది. ఈ సినిమా హిట్ కావాలని కృతి శెట్టి తన తల్లితో కలిసి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ సినిమా హిట్ అయితే దేవుడికి వెండి కిరీటం చేయిస్తానని భారీ మొక్కును కూడా మొక్కినట్టు సమాచారం.

ఇలా కృతి శెట్టి తన తల్లితో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసినటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి కృతి శెట్టి మొక్కు ఫలిస్తుందా.. ఆమె నటించిన సినిమా హిట్ అవుతుందా అనే విషయం తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి ఉండాలి. ఇక ఈమె సినిమాల విషయానికొస్తే కోలీవుడ్ స్టార్ హీరో సూర్యా సరసన ఓ సినిమాకి కమిట్ అయ్యారు. అలాగే నాగచైతన్య సరసన మరోసారి కృతి శెట్టి సందడి చేయడానికి సిద్ధమయ్యారు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus