ఒకప్పటి స్టార్ హీరోయిన్, బీజేపీ నేత అయిన ఖుష్బూ ఇంట విషాదం చోటు చేసుకుంది.ఆమె సొంత అన్నయ్య ఈరోజు మృతి చెందారు. స్వయంగా ఖుష్బూనే ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఖుష్బూకి ముగ్గురు అన్నయ్యలు. పెద్దన్నయ్య పేరు అబ్దుల్లా, రెండో అన్నయ్య అబూ బాకర్, మూడో అన్నయ్య అలీ. వీరిలో అబ్దుల్లా ఇవాళ కాలం చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అబ్దుల్లా
వారం క్రితం హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు క్రిటికల్ కండిషన్ కావడంతో వెంటిలేటర్ పై పెట్టి చికిత్స అందించారు వైద్యులు. రెండు రోజుల క్రితం ఆయన కోలుకున్నట్టు కనిపించారట.కానీ ఈరోజు పరిస్థితి విషమించడంతో చనిపోయారు. దీంతో ఖుష్భూ ఇంట్లో విషాదఛాయలు అల్లుకున్నాయి. ఈ సందర్భంగా ఖుష్బూ ట్విట్టర్లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. “మనం ఎంతగానో ప్రేమించే వ్యక్తులు ఎప్పటికీ మనతోనే ఉండాలని కోరుకుంటాము, కానీ టైం వస్తే గుడ్ బై చెప్పక తప్పదు.
నా అన్న ప్రయాణం ఇవాల్టితో ముగిసింది.ఆయన ప్రేమ, మార్గదర్శకత్వం ఎల్లప్పుడూ మాపై ఉంటాయని కోరుకుంటున్నాను. ఆయన బతకాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు.జీవిత ప్రయాణాన్ని భగవంతుడు నిర్ణయిస్తాడు అని.! అన్నయ్య ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ లో పేర్కొంది ఖుష్బూ.ఇక అబ్దుల్ నటుడిగా కొన్ని చిత్రాల్లో కూడా నటించాడు. ఖుష్బూ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ‘స్టే స్ట్రాంగ్ మేడమ్’ అంటూ ఆమె ఫాలోవర్స్ కామెంట్స్ పెడుతున్నారు.