మంచి రోల్ కోసం కథలు వింటున్న లైలా

“ఎగిరే పావురమా” సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన లైలా… తొలిసినిమాతోనే విజయం అందుకుంది. “ఉగాది”, “పెళ్లి చేసుకుందాం” వంటి సినిమాల్లోనూ మంచి నటన కనబరిచింది. నువ్వే కావాలి సినిమాలో అయితే అదిరెస్టెప్పులో ఆకట్టుకుంది. అందంతో పాటు అభినయానం ఉండడంతో దక్షిణాది అన్ని భాషల్లో సినిమాలు చేసింది. బాలీవుడ్ లోను నటించింది. ఇంత బిజీగా ఉన్న సమయంలో నటనకు బై చెప్పి.. ఓ వ్యాపారవేత్త చెయ్యి పట్టుకుంది. పెళ్లి తర్వాత విదేశాల్లో సెటిల్ అయింది. ఆమెకిప్పుడు ఇద్దరు పిల్లలు. వారి అలనాపాలనతో తీరికలేకుండా గడిపిన లైలా ఇప్పుడు మళ్లీ నటించాలని ఆశపడుతోంది.

పెళ్లి అయిన తర్వాత హీరోయిన్స్ రీ ఎంట్రీ ఇస్తూ మంచి హిట్స్ అందుకుంటున్నారు. నదియా, మీనా, రమ్యకృష్ణ, సిమ్రాన్, ఇంద్రజ, భూమిక… ఇలా చాలామంది మంచి రోల్స్ అందుకుంటున్నారు. అలాగే లైలా కూడా మంచి పాత్రతో రీ ఎంట్రీ ఇవ్వడానికి చూస్తోందని ఫిలిం నగరవాసులు చెప్పారు. ఇది ఆమె అభిమానులకు సంతోషకరమైన విషయమే. మరి ఆమె ఏ భాషలో రీ ఎంట్రీ ఇస్తారో అనేది ఆసక్తికరంగా మారింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus