తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన మీనా గత నాలుగైదు రోజులుగా ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. అందుకు కారణం మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం చెందడం. పోస్ట్ కోవిడ్ సమస్యల కారణంగా ముఖ్యంగా లంగ్స్ సంబంధిత అనారోగ్యంతో ఆయన మంగళవారం నాడు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరడం.. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మీనా భర్త ప్రాణాలు కోల్పోవడానికి పావురాలు కారణమంటూ కూడా తెగ వార్తలు వచ్చాయి.
అయితే వాటిలో నిజం లేదని దయచేసి ఇలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వేడుకున్న సంగతి తెలిసిందే. 2009 లో మీనా… విద్యాసాగర్ ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. విద్యా సాగర్ బెంగుళూరుకు చెందిన ఓ పెద్ద బిజినెస్ మెన్. వీరికి నైనిక అనే కుమార్తె కూడా ఉంది. ఈమె విజయ్ హీరోగా నటించిన పోలీసోడు( తేరి) చిత్రంలో కూతురు పాత్రలో కనిపించింది. ఇదిలా ఉండగా…మీనా ఫ్యామిలీ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :