Meena: ఆ హీరో పిల్లని తెలిగానే చాలా బాధపడ్డా: మీనా

  • March 15, 2023 / 08:18 AM IST

సినిమా ఇండస్ట్రీలోకి బాలనటిగా అడుగుపెట్టి అనంతరం హీరోయిన్ గా తెలుగు తమిళ భాషలలో నటించి అందరిని మెప్పించిన నటి మీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలానటిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె బెంగళూరుకు చెందిన ఇంజనీర్ విద్యాసాగర్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కుమార్తె కూడా ఉంది. ఈ చిన్నారి కూడా ఇదివరకే బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

ఇలా మీనా తన సెకండ్ ఇన్ని ప్రారంభించి వరస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న తరుణంలో తన భర్త అనారోగ్యానికి గురై గత ఏడాది జూన్ నెలలో చనిపోయారు.ఇలా తన భర్త మరణంతో ఎంతో కృంగిపోయిన మీనా ఇప్పుడిప్పుడే తన భర్త మరణం నుంచి బయటపడుతూ తిరిగి తన సినిమా పనులలో బిజీ అవుతున్నారు.ఇకపోతే ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 40 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మీనా తన సినీ కెరియర్ గురించి పలు విషయాలను తెలియజేశారు. పెళ్లికి ముందు తనకు బాలీవుడ్ హీరో అంటే చాలా ఇష్టమని తెలియజేశారు. పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకుంటానని చాలాసార్లు తన అమ్మ దగ్గర కూడా చెప్పానని ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు. మరి ఈ అందాల ముద్దుగుమ్మ మనసుపడిన ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే ఆయన మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.

తనకు నటుడు హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టమని ఈమె తెలియజేశారు. తనని చాలా ప్రేమించానని ఇకపోతే తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్న తన తల్లితో తనకు హృతిక్ లాంటి అబ్బాయే కావాలని కూడా చెప్పానని ఈమె తెలియజేశారు. అయితే హృతిక్ రోషన్ పెళ్లి అనే విషయం తెలియగానే ఒక్కసారిగా నా గుండె పగిలిపోయిందని,అప్పటికి ఇంకా నాకు పెళ్లి కాలేదు అంటూ ఈ సందర్భంగా హృతిక్ రోషన్ గురించి మీన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags