ఇప్పుడు ఆ నటి.. విశాల్ ను టార్గెట్ చేసింది…!

మొన్నటి వరకూ టాలీవుడ్ లో సాక్రిఫైజ్ స్టార్ హడావిడి చేసిన సంగతి తెలిసే ఉంటుంది. మహేష్ బాబుకి సినిమా ఆఫర్స్ లేకపోతే ‘1 నేనొక్కడినే’ సినిమాని తనకు త్యాగం చేసానని.. తరువాత ఎన్టీఆర్ కు ‘నాన్నకు ప్రేమతో’ సినిమా కూడా త్యాగం చేసానని హడావిడి చేసాడు. అటు తర్వాత లావణ్య త్రిపాఠి ని పెళ్ళి చేసుకున్నాను అంటూ కూడా చెత్త కామెంట్స్ చేసాడు. ఇప్పుడు ఇతని బాటలోనే ఓ తమిళ నటి కూడా నడుస్తున్నట్టు స్పష్టమవుతుంది. ఆ నటి మరెవరో కాదు మీరా మిథున్.

మొన్నటికి మొన్న త్రిష సైడ్ క్యారెక్టర్ అని… విజయ్, సూర్య లు నెపోటిజం వల్లే స్టార్లు గా ఎదిగారని ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేసింది.దాంతో విజయ్, సూర్య ఫ్యాన్స్ ఈమెను ట్రోల్ చెయ్యడం మొదలుపెడితే.. ‘ఇలాంటి కామెంట్లు చేసే వాళ్ళ కోసం మీ టైం ను వేస్ట్ చేసుకోకండి’ అంటూ సూర్య వారిని కూల్ చేసాడు. ఇప్పుడు ఈమె విశాల్ ను టార్గెట్ చేసింది. ఏకంగా విశాల్ కు … మీరా అంటే పిచ్చట. ఈ విషయాన్ని ఆమెనే చెప్పుకొచ్చింది.

మీరా మాట్లాడుతూ..”విశాల్ కు నేనంటే పిచ్చి..! నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. నేను లేకపోతే చచ్చిపోతా.. అని కూడా బెదిరించాడు.’నన్ను పెళ్లి చేసుకుంటాను’.. అని మూడేళ్లు నా వెనుక తిరిగాడు. మా అమ్మకు కూడా విశాల్ అంటే చాలా ఇష్టం.! కానీ.. నాకే బాగా డబ్బు ఉన్నవాళ్లు అంటే నచ్చదు. డబ్బు ఉన్నవాళ్లను అస్సలు పెళ్లి చేసుకోకూడదని నేను ఫిక్స్ అయ్యాను. అందుకే విశాల్ నా వెంట మూడేళ్లు తిరిగినా.. నేను పట్టించుకోలేదు. పెళ్లికి ఒప్పుకోలేదు” అంటూ కామెంట్స్ చేసింది.

Most Recommended Video

మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus