Mokksha: స్టార్ హీరోపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్. !

Advertisement

మన తెలుగు ప్రేక్షకులు సినిమాల విషయంలో పక్షపాతం లాంటివి ఏమీ చూపించరు. నచ్చితే చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్ని సినిమాలు చూస్తారు. పక్క భాషల సినిమాలు అనే బేధం లేకుండా బ్రహ్మరథం పడుతూ ఉంటారు. ఒకవేళ సినిమా నచ్చలేదు అంటే.. విమర్శల వర్షం కూడా అదే రేంజ్లో ఉంటుంది. సోషల్ మీడియాలో అలాంటివి మనం చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉంటే.. ఈ మధ్య కాలంలో ఓ పరభాషా నటుడు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అవుతున్నాడు.

అతను మరెవరో కాదు జీత్ అలియాస్ జితేంద్ర మధ్నాని. ఇతను చాలా మందికి తెలియకపోవచ్చు. ఇతను ఓ బెంగాలీ హీరో. మన ‘అతడు’ (Athadu) ‘నాన్నకు ప్రేమతో’ (Nannaku Prematho) ‘బిజినెస్ మెన్’ (Businessman) ‘ఆర్య’ (Arya) వంటి చాలా సూపర్ హిట్ సినిమాలను ఇతను రీమేక్ చేశాడు. వాస్తవానికి జితేంద్ర మధ్నాని హీరోగా కెరీర్ ను ప్రారంభించింది మన తెలుగు సినిమాతోనే..! 2001 లో వచ్చిన ‘చందు’ అనే సినిమాతో ఇతను హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అది వచ్చి వెళ్లినట్టు కూడా చాలా మందికి తెలీదు.

ఇక్కడ సక్సెస్ రాకపోవడంతో బెంగాలీలో సెటిల్ అయ్యాడు. ఇతని గురించి హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘అలనాటి రామచంద్రుడు’ అనే సినిమా ఈ శుక్రవారం అంటే ఆగస్టు 2న రిలీజ్ కాబోతోంది. ఇందులో హీరోయిన్ గా నటించిన మోక్ష  (Mokksha) .. జీత్ గురించి స్పందించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఆమె మాట్లాడుతూ.. ‘బెంగాలీలో ఇప్పుడు తెలుగు సినిమాలే ఎక్కువగా చూస్తున్నారు. జీత్ కి కూడా అక్కడ మార్కెట్ లేదు. నాన్ థియేట్రికల్ పైనే ఆధారపడ్డాడు. తెలుగు సినిమాలు రీమేక్ చేస్తే కమర్షియల్ గా వర్కౌట్ అవుతుంది అని భావించి ఆ మార్గంలో నడుస్తున్నాడు’ అంటూ కామెంట్స్ చేసింది మోక్ష.

https://www.youtube.com/watch?v=LHTlUup7dKc&pp=ygUKamVldCB0cm9sbA%3D%3D

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus