హనురాగపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు నటి మృణాల్ ఠాకూర్. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయం అందుకోవడమే కాకుండా తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఈమె వెండితెర సీతమ్మగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా తెలుగులో నటించినది ఒక్క సినిమా అయినప్పటికీ ఈ సినిమాతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఆగస్టు 5వ తేదీ విడుదలైన ఈ సినిమా థియేటర్లో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని
ప్రస్తుతం డిజిటల్ మీడియాలో ప్రసారమవుతూ ఇక్కడ కూడా మంచి విజయం అందుకుంది. ఇలా ఈ సినిమా మంచి హిట్ కావడంతో ఈమెకు తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈ నటి పెళ్లి పిల్లలు సమాజంపై మహిళలు ఎదుర్కొని ఇబ్బందులు ప్రశ్నల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఈ సమాజంలో ఒక మహిళపై ఎంతోమంది ప్రేమ పెళ్లి పిల్లలు వంటి వివిధ రకాల ప్రశ్నలు వేస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే తన జీవిత భాగస్వామి గురించి మాట్లాడుతూ తాను ఎక్కడి నుంచి వచ్చాను తాను ఏం పని చేస్తున్నాను తన మనసుఏం జరుగుతుందనే విషయాల గురించి అర్థం చేసుకునే వ్యక్తి జీవిత భాగస్వామిగా రావాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇలా తనని బాగా అర్థం చేసుకొనే ఒక సురక్షితమైన వ్యక్తి నాకు కావాలని కోరుకుంటున్నాను
అయితే ప్రస్తుతం అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉన్నారని అందుకే తనకు పెద్దగా ప్రేమ పెళ్లి గురించి ఆసక్తి లేదని తెలిపారు. ఇలా పెళ్లి గురించి ఆసక్తి లేకపోయినా పిల్లలు మాత్రం కావాలని ఉంది అంటూ ఈ సందర్భంగా వెండితెర సీతమ్మ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!