Bhuma Mounika Reddy: భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?

మంచు మోహన్ బాబు ఫ్యామిలీ ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో నిలుస్తుంటుంది.మోహన్ బాబు చిన్న కొడుకు మనోజ్ ను తప్ప మిగిలిన వాళ్ళందరినీ నెటిజన్లు ట్రోలింగ్ స్టఫ్ గానే చూస్తుంటారు. మనోజ్ పై మాత్రం జనాల్లో సాఫ్ట్ కార్నర్ ఉంది. ఇదిలా ఉండగా.. మనోజ్ కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అందుకు గల కారణాలు అందరికీ తెలిసినవే..! 2015లో ప్రణతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు మనోజ్. కానీ వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు.

పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అవ్వడంతో మనోజ్ కూడా డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. తర్వాత సినిమాల్లో బిజీ అవ్వాలని ‘అహం బ్రహ్మాస్మి’ అనే చిత్రాన్ని మొదలుపెట్టాడు మనోజ్. కానీ కొన్ని కారణాల వల్ల ఆ మూవీ హోల్డ్ లో పడింది. అయితే ఊహించని విధంగా మనోజ్ ఇటీవల భూమా మౌనిక రెడ్డితో కలిసి కనిపించాడు. వినాయక మండ‌పం వ‌ద్ద మౌనికారెడ్డితో క‌లిసి పూజ‌లు చేశాడు మ‌నోజ్‌. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

గతంలో కూడా మనోజ్ రెండో పెళ్లి గురించి వార్తలు వచ్చాయి. వాటిని మనోజ్ ఖండించాడు. ఈసారి కూడా అలాంటి ప్రచారం మొదలైంది. దీనికి మాత్రం మనోజ్ ‘తర్వాత మంచి రోజు చూసి సమాధానం ఇస్తాను’ అంటూ తెలిపాడు. దీంతో వీరి పెళ్లి ఫిక్స్ అంటూ కథనాలు ఎక్కువవుతున్నాయి. మరో వైపు భూమా మౌనిక గురించి కూడా కొన్ని షాకింగ్ విషయాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

1) ఈమె దివంగత నేత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ల.. రెండవ కుమార్తె అన్న సంగతి తెలిసిందే.ఈమె అసలు పేరు భూమా నాగ మౌనిక.

2) ఈమెకు గతంలో బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తితో పెళ్ళయ్యింది. 5 సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు. కానీ మొదటి భర్తతో ఈమె విడాకులు తీసుకుంది.

3) తండ్రిలానే ఈమె కూడా ఆళ్లగడ్డ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆమె ప్రయత్నిస్తున్నారు. ఈమె చాలా అగ్రెసివ్ పర్సన్. అలా అని ప్రతీసారి విషయాన్ని పెద్దది చేసి మాట్లాడదు. ఈమెను ఎవ్వరూ ఇబ్బంది పెట్టనంత వరకు చాలా సౌమ్యంగా, మర్యాదగానే మాట్లాడుతుంది.

4) నాగ మౌనిక చాలా తెలివైన వ్యక్తి. కొన్నాళ్లుగా ఈమె హైదరాబాద్లోనే ఉంటున్నారు.

5) తన సోదరి అఖిలప్రియతో ఈమెకు ఆస్తి వివాదాలు ఉన్నాయి. వాటిని పరిష్కరించుకోవాలని భూమా మౌనిక భావిస్తున్నారు.

6) 2018 నుండి నాగ మౌనిక కు మంచు మనోజ్ కు మధ్య పరిచయం ఏర్పడింది. మనోజ్ సామాజిక సేవలు చేస్తుంటాడు. అందులో భాగంగానే మౌనికతో మనోజ్ కి పరిచయం ఏర్పడింది.

7) ప్రస్తుతం మనోజ్.. మౌనికతో కలిసి ఉంటున్నట్టు కూడా కొన్నాళ్ల నుండి ప్రచారం జరుగుతుంది. కానీ సినిమా వాళ్ళ పై ఇలాంటి వార్తలు మామూలే అని అంతా భావించి లైట్ తీసుకున్నారు.

8) భూమా మౌనిక ఆస్తుల విలువ సుమారు రూ.2000 కోట్లు ఉంటుందని అంచనా. ఆమె విడాకులు తీసుకున్న టైం లో కూడా భరణంగా రూ.250 కోట్ల వరకు అందుకున్నట్టు తెలుస్తుంది.

9)మౌనిక ని మంచు మనోజ్ పెళ్లి చేసుకోవడం.. అతని కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని వినికిడి. అందుకే మనోజ్ ఇప్పుడు అతని కుటుంబంతో దూరంగా ఉంటున్నాడని సమాచారం.

10) మౌనిక కంటే ముందు.. అంటే గతంలో మనోజ్ వివాహం చేసుకున్న ప్రణతి కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన యువతే..! ‘ఇప్పుడు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి? అది కూడా విడాకులు తీసుకుని.. కొడుకుతో కలిసుంటున్న యువతితో’ అంటూ మంచు ఫ్యామిలీలో డిస్కషన్లు మొదలైనట్టు సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus