#BiggBossTelugu6: బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 రచ్చ మొదలైంది. ఇక బిగ్ బాస్ లవర్స్ అందరికీ ప్రతిరోజు పండగే అని చెప్పాలి. ఈసారి 106రోజుల పాటు ఈ రియాలిటీ షో జరగబోతోంది. ప్రతిరోజు రాత్రి 10గంటల నుంచీ స్టార్ మాలో ప్రసారం అవుతుంది. ప్రతి సోమవారం నామినేషన్స్ హీటెక్కిస్తే, ప్రతి ఆదివారం ఎలిమినేషన్స్ టెన్షన్ పుట్టిస్తాయి. బిగ్ బాస్ లవర్స్ అందరూ వాళ్ల ఫేవరెట్స్ ని సపోర్ట్ చేస్తూ ట్రోలింగ్స్, మీమ్స్, ఫన్ వీడియోలతో సోషల్ మీడియాని హోరెత్తించేస్తారు. ఈసారి కంటెస్టెంట్స్ ఒక్కొక్కరూ స్టేజ్ పైన పెర్ఫామ్ చేస్తూ దుమ్మురేపారు. ఫస్ట్ నాగార్జున ఎప్పటిలాగానే బిగ్ బాస్ హౌస్ ని పరిచయం చేశాడు. ఈ సీజన్ లో వచ్చిన కంటెస్టెంట్స్ ని ఒక్కసారి పరిశీలించినట్లయితే..,

నెంబర్ 1 – కీర్తి భట్

గ్లామరస్ గార్ల్ గా స్టేజ్ పైకి అడుగుపెట్టింది కీర్తి భట్. మంచి స్టేజ్ పెర్ఫామన్స్ తో ఆకట్టుకుంది. లాస్ట్ మినిట్ వరకూ ఎవరూ కూడా కీర్తి భట్ పార్టిసిపెంట్ గా వస్తుందని అనుకోలేదు. చేసింది కొన్ని సీరియల్సే అయినా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ని క్రియేట్ చేసింది. మంగళూర్ లో పుట్టి పెరిగిన ఈ అమ్మడు కన్నడలో 2017లో ఐస్ మహల్ అనే సినిమాతో అరంగేట్రం చేసింది. అంతకు ముందు మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టినా పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ సినిమా తర్వాత చాలామంది సీరియల్స్ లోకి రమ్మని ప్రోత్సహించారు. దీంతో మనసిచ్చి చూడు సీరియల్ తో అడుగుపెట్టింది. ఆ తర్వాత కార్తీకదీపం లాంటి ఫేమస్ సీరియల్ తో ఫేమ్ సంపాదించింది. కీర్తి భట్ ఒక యాక్సిడెంట్ లో తల్లిదండ్రులని పోగొట్టుకుంది. అంతేకాదు, తన బ్రదర్ ని, సిస్టర్ ని కూడా పోగొట్టుకుని మూడు నెలలపాటు తను కోమాలో ఉండిపోయింది. ఆ తర్వాత కార్తీకదీపం సీరియల్ లో అలాంటి క్యారెక్టర్ చేసి తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది. కీర్తి భట్ తను భట్ అనే అమ్మాయిని దత్తత తీసుకుని పెంచుకుంటోంది. మరి ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ లో ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూడాలి.

నెంబర్ 2 – సుదీప.

సుదీప తెలుగు వారికి చాలా సుపరిచితురాలు. తన ఎవితో తనేంటో మరోసారి అందరికీ చూపించింది. తన హస్బెండ్ ని కూడా పరిచయం చేసింది. సూపర్ డూపర్ హిట్ సినిమా నువ్వు నాకు నచ్చావ్ లో ఆర్తిఅగర్వాల్ కి సిస్టర్ గా పింకీగా కనిపించి మెప్పించింది. అప్పట్నుంచీ సుదీపని చిన్నపిల్లగానే చూశారు తెలుగు ప్రేక్షకులు. ఆ తర్వాత నువ్వే నువ్వే సినిమాలో తరుణ్ కి సిస్టర్ గా, బొమ్మరిల్లు సినిమాలో సిద్దార్ధ్ కి సిస్టర్ గా యాక్ట్ చేసి తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది. కొన్నాళ్ల గ్యాప్ తర్వాత తెలుగు సీరియల్స్ తో బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో సుదీప గేమ్ ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరం.

నెంబర్ 3- శ్రీహాన్

లాస్ట్ సీజన్ లో సిరి బాయ్ ఫ్రెండ్ గా స్టేజ్ పైన నాగార్జునతో కలిసి సందడి చేశాడు. అప్పట్నుంచీ శ్రీహాన్ కి ఫాలోయింగ్ పెరిగిపోయింది. స్టేజ్ పైన పెర్ఫామన్స్ తో దుమ్మురేపాడు. అంతేకాదు, మరోసారి సాంగ్ పాడి ఆడియన్స్ హృదయాలని దోచుకున్నాడు. అంతకుముందు యూట్యూబ్ లో ఫేమస్ అయినా కూడా పెద్దగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం లేదు. ఒక్కసారి స్టేజ్ పైన శ్రీహాన్ బిహేవియర్ చూసి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈ సీజన్ లో ఫస్ట్ నుంచీ కూడా శ్రీహాన్ రావాలని ప్రతి బిగ్ బాస్ అభిమాని కోరుకున్నాడు. ఇక శ్రీహాన్ తనదైన స్టైల్లో దుమ్మురేపాడు. హౌస్ లోకి ఎంట్రీ ఇస్తునే చాలా హుషారుగా కనిపించాడు. ఈసారి టైటిల్ రేసులో మనోడు కూడా ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీహన్ ఇండియన్ నావిలో మూడు సంవత్సరాలు వర్క్ చేశాడు. ఆ తర్వాత నటన పట్ల ఆసక్తితో 2015లో చారి లవర్ ఆఫ్ శ్రావణి అనే షార్ట్ ఫిలింలో యాక్ట్ చేశాడు. ఆ తర్వాత సాఫ్ట్ వేర్ బిచ్చగాడు అనే సీరిస్ లో కూడా నటించాడు. ఆ తర్వాత ఈటివి ప్లస్ లో అవకాశం వచ్చింది. అమ్మాయి క్యూట్ అబ్బాయి నాట్ , పిట్టగోడ సీరియల్స్ లో నటించాడు. విశాఖపట్నం నుంచీ వచ్చి హైదరాబాద్ లో సెటిలైన ఈ కుర్రాడు బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ విన్నర్ అవుతాడా లేదా అనేది చూడాలి.

నెంబర్ 4 – నేహా చౌదరి

నేహా చౌదరి ఇంట్రోనే దద్దరిల్లిపోయింది. అద్దిరిపోయే డ్యాన్స్ తో తనలోని డ్యాన్సర్ ని ఆడియన్స్ కి చూపించింది. నేహా చౌదరి గురించి చెప్పాలంటే తిరుపతిలో సాధారణ మద్యతరగతి కుటుంబంలో పుట్టిన నేహా చౌదరి కంప్యూటర్ సైన్స్ చదివింది. ఆ తర్వాత గూగుల్ లో చాలాకాలం వర్క్ చేసింది. ఆ తర్వాత యాంకర్ గా మహాన్యూస్ లో వర్క్ చేసింది. ఎన్ టివి, వనితటివి, హెచ్ ఎం టివి, స్టార్ మ్యూజిక్ ఛానల్స్ లో కూడా యాంకర్ గా వర్క్ చేసింది. స్టార్ స్పోర్ట్స్ తెలుగులో కామెంట్రేటర్ గా , యాంకర్ గా అవకాశం రావడంతో నేహా చౌదరి ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా తెలుగులో ఐపియల్ చూసేవారికి నేహా చౌదరి బాగా పరిచయం. జీతెలుగులో మంచి లక్ష్మీ షో మహారాణిలో రన్నర్ గా నిలిచింది. అంతేకాదు, 2019 సైమా అవార్డ్స్ కి యాంకర్ గా చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది నేహా. నేహా, ఇంకా సూర్య ఇద్దరూ ట్విన్స్. తన బ్రదర్ డిస్టిక్ లెవల్లో క్రికెట్ ఆడటంతో నేహా చౌదరికి క్రికెట్ పట్ల ఆసక్తికలిగింది. మరి బిగ్ బాస్ హౌస్ లో నేహా జెర్నీ ఎలా ఉంటుందో చూడాలి.

నెంబర్ – 5 – చలాకీ చంటి

బజర్ధస్త్ షో లో చలాకీ చంటి టీమ్ లీడర్ గా ఎన్నో స్కిట్స్ చేశాడు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో జరగని నవ్వుల ముద్రని వేశాడు. ఎవిలో బింబిసారా అంటూ ఎంట్రీ ఇచ్చాడు. చంటిసారా అని తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేశాడు. తన జీవితంలో అన్నీ పొగొట్టుకున్నప్పుడు తన భార్య తనకి అండగా నిలిచిందని, తన లవ్ స్టోరీని కూడా చెప్పాడు. తనంతట తానే వాళ్ల తల్లిదండ్రులతో గొడవ పడి మరీ తనని పెళ్లి చేసుకుందని చెప్పుకొచ్చాడు. జబర్ధస్త్ పాపులర్ షో తర్వాత నాఇష్టం అనే షోతో బాగా పాపులారిటీని సంపాదించుకున్నాడు. అడపా దడపా సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేశాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 అనేది చలాకీ చంటి కెరియర్ కి ఎలా ప్లస్ అవుతుందనేది చూడాలి.

నెంబర్ 6 – శ్రీసత్య

శ్రీసత్య సీరియల్ ఆర్టిస్ట్ గా అందరికీ సుపరిచితురాలు. స్టేజ్ పైన స్పెషల్ పెర్ఫామన్స్ తో ఆకట్టుకుంది. వస్తూనే తనకి జంక్ ఫుడ్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. దీంతో నాగార్జున కాసేపు ఫన్ చేసి మరీ కేఎఫ్ సి చికెన్ ఇచ్చి పంపాడు. విజయవాడకి చెందిన శ్రీసత్య అచ్చమైన తెలుగు అమ్మాయి. చదువు పూర్తి అవ్వగానే మోడల్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసింది. 2015లో మిస్ విజయవాడగా టైటిల్ విన్నర్ గా నిలిచింది. నేను శైలజ అనే సినిమాలో చిన్న క్యారెక్టర్ లో కనిపించింది. ఆ తర్వాత లవ్ స్కెచ్ , గోదారి నవ్వింది అనే సినిమాల్లో కూడా నటించింది. ఆ తర్వాత స్టార్ మాలో వచ్చే ముద్దమందారం సీరియల్ ద్వారా తెలుగు వారికి దగ్గరయ్యింది. ఆ తర్వాత నిన్నేపెళ్లాడతా, అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు, త్రినయిని సీరియల్స్ లో నటిస్తూ ఫుల్ బిజీ అయ్యింది. ఆ తర్వాత అంతా బ్రాంతియేనా సినిమా, తొందరపడకు సుందరవదనా సినిమాల్లో నటించింది. ప్రస్తుతం కొన్ని వెబ్ సీరిస్ కి కూడా సైన్ చేసింది. మరి ఈ బిగ్ బాస్ సీజన్ 6 అనేది అమ్మడి కెరియర్ కి ఎలా హెల్ప్ అవుతుంది అనేది చూడాలి.

నెంబర్ 7 – అర్జున్ కళ్యాణ్

అర్జున్ కళ్యాణ్ సైలెంట్ గా ఎంట్రీ ఇచ్చినా మనోడిలో విషయం చాలా ఉంది అనిపించింది. మంచి డ్యాన్స్ పెర్ఫామన్స్ తో ఆకట్టుకున్నాడు. అంతేకాదు, చూస్తుంటే మంచి గేమర్ గా అయ్యే అవకాశం ఉంది మనోడిలో. తెలుగు ఇండస్ట్రీలో చిన్న బడ్జెట్ సినిమాల్లో హీరోగా ఇప్పుడిప్పుడే సెటిల్ అయ్యాడు. ముఖ్యంగా ప్లే బ్యాక్ సినిమా అర్జున్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. విశాఖపట్నంలో బిటెక్ చదివిన అర్జున్, ఆ తర్వాత యుఎస్ లో మాస్టర్స్ ఫినిష్ చేశాడు. అక్కడే థియేటర్స్ కోర్స్ లో యాక్టింగ్ కోర్స్ ని కంప్లీట్ చేశాడు. చిన్ని సినిమా షూటింగ్ అక్కడ జరగడంతో ఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. స్క్రీన్ ప్లే రైటింగ్, డైలాగ్ రైటింగ్ పై మనోడికి మంచి గ్రిప్ ఉంది. ఆ తర్వాత చాలా షార్ట్ ఫిల్మిమ్స్ లో నటించాడు. మిస్సమ్మ, ప్లేబ్యాక్ సినిమాలు మనోడికి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి. మరి ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 అనేది ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి.

నెంబర్ 8 – గీతురాయల్.

చిత్తూరు యాసలో ఇరగదీసింది. అంతేకాదు, తనకి జరిగిన యాక్సిడెంట్ గురించి, తన జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనే దాని గురించి ఎవిలో చెప్పింది. తన భర్తని కూడా పరిచయం చేసింది గీతురాయల్. బిగ్ బాస్ షోని రివ్యూస్ చేస్తూ యూట్యూబ్ లో మంచి పేరు తెచ్చుకుంది గీతు రాయల్. అంతేకాదు, యాంకర్ గా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 అనే ఫ్లాట్ ఫార్మ్ ని గీతురాయల్ ఎలా ఉపయోగించుకుంటుంది అనేది చూడాలి.

నెంబర్ 9 – అభినయశ్రీ

అ- అంటే అమలాపురం, ఆ – అంటే ఆహాపురం అంటూ అప్పట్లోనే ఆహా ఓటీటీకి పబ్లిసిటీ చేసిన అభినయశ్రీ ఇప్పుడు బిగ్ బాస్ స్టేజ్ పైన కూడా అదే పాటతో దుమ్మురేపింది. చిన్నప్పటి నుంచీ పెట్స్ అంటే తనకి ఎంతిష్టమో కళ్లకి కట్టినట్లుగా చూపించింది. పులి పిల్లని పట్టుకున్న ఫోటో అయితే ఎపిసోడ్ లోనే హైలెట్ గా నిలిచింది. చాలాకాలం తర్వాత తెలుగు ప్రేక్షకులని మళ్లీ పలకరించిన ఈ అమ్మడు బిగ్ బాస్ షో ద్వారా ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూడాలి. ఆర్య సినిమా తర్వాత కొన్ని సినిమాలు చేసినా కూడా గుర్తుండి పోయే క్యారెక్టర్ మాత్రం చేయలేదు. బోల్డ్ గా, స్ట్రయిట్ గా మాట్లాడే అభినయశ్రీ బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని వారాలు ఉంటుంది అనేది ఆసక్తికరం.

నెంబర్ 10 & 11 రోహిత్ అండ్ మెరీనా కపుల్.

అద్భుతమైన సాంగ్ తో ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరి మద్యలో కెమిస్ట్రీ సింప్లీ సూపర్బ్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో వితిక ఇంకా వరుణ్ కపుల్ ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. హౌస్ లో వీరిద్దరూ రొమాన్స్ చేయకపోయినా ఒకర్ని ఒకరు నామినేట్ చేసుకుని బిగ్ బాస్ ప్రేక్షకులని మంచి కిక్ ఇచ్చారు. ఇప్పుడు చాలా సీజన్స్ తర్వాత మరోసారి రోహిత్ అండ్ మెరీనా ఇద్దరూ కపుల్ ఎంట్రీ ఇచ్చారు. సీరియల్స్ లో మంచి ఫేమ్ తెచ్చుకున్న ఇద్దరూ తెలుగు ఆడియన్స్ కి బాగా పరిచయమే. మరి వీరిద్దరూ హౌస్ లో ఎలా ఉండబోతున్నారు అనేది ఆసక్తికరం.

నెంబర్ – 12 – బాలాదిత్య

చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై, ఆ తర్వాత చంటిగాడు అంటూ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు బాలాదిత్య. బిగ్ బాస్ లో తన ఎవితో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాడు. అంతేకాదు, రీసంట్ గా పుట్టిన తన రెండోపాప ఫోటోని తీస్కుని మరీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. నిజానికి పక్కా కమర్షియల్ సినిమాలు చేయకపోయినా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ని తెలుగు ఇండస్ట్రీలో క్రియేట్ చేస్కున్నాడు. ఆ తర్వాత కీలుగుర్రం, సుందరానికి తొందరెక్కువ, రూమ్ మేట్స్, సంద్య, వేట, భద్రాద్రి, జాజిమల్లి, 1940 ఒక గ్రామం, ఎంతమంచివాడవురా అంటూ చాలా సినిమాలు చేశాడు. కానీ, 1940 ఒక గ్రామం సినిమా మాత్రమే వీటిలో గుర్తుండిపోయింది. ఈ సినిమాకి నేషనల్ అవార్డ్ రావడం అనేది బాలాదిత్యకి మంచి గుర్తింపుని తీస్కుని వచ్చింది. ఆ తర్వాత ఈటివి ఛాంపియన్స్ ప్రోగ్రామ్ కి యాంకర్ గా మారి తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. తర్వాత సావిత్రమ్మ గారి కొడుకు, శాంబవి సీరియల్స్ తో తెలుగు ప్రేక్షకులని మెప్పించాడు. రీసంట్ గా పొలిమేర వెబ్ ఫిలింతో తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో కంటెస్టెంట్ గా వచ్చిన బాలాదిత్య గేమ్ ఎలా ఆడతాడు అనేది ఆసక్తికరం.

నెంబర్ 13 – వసంతీ కృష్ణన్

 

తిరుపతిలో పుట్టిన తెలుగు అమ్మాయి వసంతీ. కృష్ణన్ అని తన నాన్నగారి పేరుని జోడించుకున్నాక కెరియర్ లో దూసుకుపోయింది. బిగ్ బాస్ స్టేజ్ పైన బ్యూటిఫుల్ పెర్ఫామన్స్ తో ఎంట్రీ ఇచ్చింది. నిజానికి తిరుపతి నుంచీ బెంగుళూర్ కి షిఫ్ట్ అయ్యి, అక్కడ మోడలింగ్ లో రాణించింది. అక్కడే నాలుగు కన్నడ సినిమాల్లో కూడా హీరోయిన్ గా చేసింది. కానీ, అవి బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో సీరియల్స్ లో వర్క్ చేయాల్సి వచ్చింది. తెలుగులో స్టార్ మాలో పాపులర్ అయిన గుప్పెడంత మనసు సీరియల్ లో స్టార్టింగ్ లో సాక్షి క్యారెక్టర్ చేసింది వసంతీ. ఆ తర్వాత సిరిసిరిమువ్వు, గోరింటాకు సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. రీసంట్ గా పండుగాడ్ సినిమాలో శ్రీనివాసరెడ్డికి జోడీగా హీరోయిన్ గా నటించి తెలుగువారికి దగ్గరైంది. స్వచ్ఛమైన తెలుగు మాట్లాడే వసంతీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో ఎలా గేమ్ ఆడుతుందో చూడాలి మరి.

నెంబర్ 14 – షానీ సాల్మాన్

సూపర్ డూపర్ ఎవితో ఎంట్రీ ఇచ్చాడు షానీ. తనకి ఐదుగురు గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారని వారి మొదటి అక్షరాలతోనే తన పేరుని S H A N I ని పెట్టుకున్నానని చెప్పాడు. సై సినిమా ఆఫర్ తనకి వచ్చిన రోజునే షానీ అమ్మగారు చనిపోయారని, ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ విని తట్టుకున్న గుండె అని భారంగా చెప్పాడు. చూస్తుంటే మంచి మాస్ ఫైట్ ఇచ్చేలాగానే కనిపిస్తున్నాడు. సై సినిమాలో తళుక్కుమని మెరిసిన షానీ ఆ తర్వాత పెద్దగా గుర్తింపు రాలేదనే చెప్పాలి. స్వతహాగా కోకో ప్లేయర్ అవ్వడం అనేది బిగ్ బాస్ లో తనకి ప్లస్ పాయింట్ లాగానే కనిపిస్తోంది. మరి చూద్దాం ఈ షో మనోడిని ఏ రేంజ్ లో తీస్కుని వెళ్తుంది అనేది.

నెంబర్ 15 – ఇనయా సుల్తానా

మోడల్ గా కెరియర్ ప్రారంభించిన సుల్తానా ఆ తర్వాత చిన్న చిన్న సీరిస్ లతో ఫేమ్ ని సంపాదించింది. ఊ అంటా వా మామ అనే సాంగ్ తో బిగ్ బాస్ హౌస్ ని వేడెక్కించింది. హాట్ హాట్ అందాలతో కనువిందు చేస్తూ సూపర్ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. చూడటానికి చాలా ఎమోషనల్ పర్సన్ గా అనిపిస్తోంది. తెలుగులో ఏవం జగత్ అనే సినిమాలో యాక్ట్ చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆర్జీవి బర్త్ డే పార్టీలో ఫేమస్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 అనేది అమ్మడికి ఎలాంటి క్రేజ్ ని తీస్కుని వస్తుందనేది చూడాలి.

నెంబర్ 16 – ఆర్జే సూర్య.

తనదైన మాస్ స్టైల్లో స్టేజ్ పైన దుమ్మురేపాడు. అంతేకాదు, నాగార్జున ముందు టాప్ హీరోలని మిమిక్రీ చేస్తూ ఔరా అనిపించాడు. నిజానికి మనోడు విజయ్ దేవరకొండని మిమిక్రీ చేస్తూ చాలా పాపులర్ అయ్యాడు ఆర్జే సూర్య. టీవి 9లో కొండబాబుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఆర్జేగా కెరియర్ ని స్టార్ట్ చేసిన సూర్య, ఆ తర్వాత చాలా స్టేజ్ షోలు, ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేశాడు. యాంకర్ గా ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాడు. మరి ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 అనేది మనోడి కెరియర్ కి ఎంతవరకూ ప్లస్ అవుతుందనేది చూడాలి.

నెంబర్ 17 – ఫైమా

ఫైమా జబర్ధస్త్ , పటాస్ లాంటి ప్రోగ్రామ్స్ తో మంచి పేరు తెచ్చుకుంది. తన ఎవి చూస్తుంటే తెలుగు ప్రేక్షకుల గుండెలు బరువెక్కిపోయాయి. ఎన్నో కష్టాలని దాటుకుంటూ ఒక సెలబ్రిటీగా ఇప్పుడు పేరు తెచ్చుకుంది. నవ్వించే ఫైమా జీవితం వెనక ఎన్నో బాధలు ఉన్నాయి. లేడీ కమెడియన్ గా, రెబల్ ఆర్టిస్ట్ గా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యింది. దీంతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో అవకాశం వచ్చింది. మరి ఈ అవకాశాన్ని ఫైమా ఎలా ఉపయోగించుకుంటుంది. తన రియల్ క్యారెక్టర్ ఏంటో తెలుగు ప్రేక్షకులకి ఎలా పరిచయం చేస్తుంది అనేది ఆసక్తికరం.

నెంబర్ – 18 – ఆదిరెడ్డి

బిగ్ బాస్ షో చూసే ఆడియన్స్ కి ఆదిరెడ్డి గురించి పరిచయం అక్కర్లేదు. ఈ షోని రివ్యూ చేస్తూ చాలా పాపులారిటీని సంపాదించాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లోకి అనూహ్యంగా అడుగుపెట్టాడు. ఇన్ స్ట్రా గ్రామ్ లో ఫాలోవర్స్ ని సంపాదించడం ద్వారా చిన్న చిన్న ఛారిటీ పనులు చేస్తూ సెలబ్రిటీల దృష్టిలో పడ్డాడు. తన ట్వీట్ కి వాళ్లు రీట్వీట్స్ చేయడంతో పాపులారిటీ వచ్చింది. ఇక బిగ్ బాస్ షో రివ్యూస్ కి లక్షల్లో వ్యూవర్స్ ఉండటం అనేది ఆదిరెడ్డికి ప్లస్ పాయింట్. దీంతోనే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6లోకి అడుగుపెట్టాడు. నెల్లూర్ జిల్లా కావలికి చెందిన ఆదిరెడ్డి ఉడాల్ అనే పదాన్ని క్రియేట్ చేసి క్రేజ్ తెచ్చుకున్నాడు. మరి ఈ ఆదిరెడ్డి గేమ్ లో ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడు అనేది ఆసక్తికరం.

నెంబర్ 19 ఆరోహిరావ్.

టివి 9 నుంచీ ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తునే ఉంటారు. ఈసారి ఇస్మార్ట్ న్యూస్ చదివే ఆరోహిరావ్ అలియాస్ అంజలికి ఈ అవకాశం దక్కింది. వరంగల్ లో ఒక మారుమూల గ్రామంలో పుట్టిన ఆరోహిరావ్ చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడింది. చిన్నతనంలోనే అమ్మకి దూరమై అమ్మమ్మ దగ్గర ఓనమాలు దిద్దింది. చదువులో తన సత్తాని చాటి ఎంబిఎ ఫినిష్ చేసింది. కాలేజ్ లో ఉన్నప్పుడే యాంకర్ అవుదామని ఫిక్స్ అయి హైదరాబాద్ వచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. టివి 9లో ఇస్మార్ట్ న్యూస్ చదవడం అనేది ఆరోహిరావ్ కి మంచి గుర్తింపుని తీస్కుని వచ్చింది. చిన్నప్పుడే ఎన్నో కష్టాలు పడి రాటుదేలిన ఈ తెలంగాణ పోరి హౌస్ లో ఎలాంటి పోరాటం చేస్తుందనేది చూడాలి.

నెంబర్ 20 మోడల్ రాజశేఖర్

లాస్ట్ సీజన్ లో మోడల్ కేటగిరిలో జెస్సీ ఎలాగైతే వచ్చాడో ఇప్పుడు మోడల్ కేటగిరిలో రాజశేఖర్ ని తీస్కున్నారు. మోడల్ గా తనకంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేశాడు రాజశేఖర్. రాజశేఖర్ ముత్యాలు హైదరాబాద్ లో ఫేమస్ మోడల్. హైదరాబాద్ కి చెందిన రాజశేఖర్ చదువు పూర్తి అయ్యాక ఇండస్ ఇండ్ బ్యాంక్ లో పైనాన్షియల్ అడ్వైజర్ గా వర్క్ చేశాడు. ఆ తర్వాత సౌత్ ఇండియాలో చాలా కంపెనీలకి మోడలింగ్ వర్క్స్ చేశాడు. ఫ్లిప్ కార్ట్, స్నేహా చికెన్, బందన్ టైల్స్ లాంటి సంస్థలతో కలిసి వర్క్ చేశాడు. ఆ తర్వాత కళ్యాణ వైభోగమే, మనసంతా నువ్వే సీరియల్స్ లో క్యారెక్టర్స్ లో కూడా యాక్ట్ చేశాడు. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో అవకాశం రావడం అనేది రాజశేఖర్ కెరియర్ కి ప్లస్ అనే చెప్పాలి. మరి మనోడు గేమ్ ఎలా ఆడతాడు అనేది ఆసక్తికరం.

నెంబర్ 21 సింగర్ రేవంత్.

పరిచయం అక్కర్లేని క్రేజ్ సింగర్ రేవంత్ సొంతం. ఇండియన్ ఐడియల్ గా నేషనల్ లెవల్లో క్రేజ్ ని సంపాదించాడు. అంతేకాదు, స్టార్ మా సింగింగ్ షోలో యాంకర్ గా కూడా తన సత్తాని చాటాడు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకి రేవంత్ బాగా దగ్గరయిన వ్యక్తి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. తనదైన స్టైల్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన రేవతం ఈ సీజన్ లో గేమ్ ఎలా ఆడతాడు అనేది ఆసక్తికరం.

మొత్తానికి ఈసారి యంగ్ అండ్ ఎనర్జిటిక్ పార్టిసిపెంట్స్ తో బిగ్ బాస్ హౌస్ దద్దరిల్లిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. టాస్క్ ల్లో కొట్టుకోవడం, ఆర్గ్యూమెంట్ చేసుకోవడం, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం ఇలా ఎవరి స్టైల్లో వాళ్లు గేమ్ ఆడుతూ రెచ్చిపోతారు. ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లో ఎలాంటి ట్విస్ట్ లు ఉండబోతున్నాయి అనేది ఆసక్తికరం.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus