Revanth: బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

తెలుగు నాట ‘బిగ్ బాస్’ రియాలిటీ షో కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆల్రెడీ 5 సీజన్లు సక్సెస్ ఫుల్ గా ముగిశాయి. ఓటీటీ సీజన్ అంతగా సక్సెస్ కాకపోయినా … ఆ ప్రభావం సీజన్ 6 పై పడలేదు. బిగ్ బాస్ సీజన్ 6 నిన్న అనగా సెప్టెంబర్ 4న లాంఛనంగా మొదలైంది. ఈ సీజన్ ను కూడా 106 రోజుల పాటు నిర్వహించనుంది బిగ్ బాస్ టీం. ప్రతిరోజు రాత్రి 10 గంటల నుండి స్టార్ మాలో టెలికాస్ట్ కానుంది. ప్రతి సోమవారం నామినేషన్స్ హీటెక్కిస్తే, ప్రతి ఆదివారం ఎలిమినేషన్స్ టెన్షన్ పుట్టిస్తాయి. బిగ్ బాస్ లవర్స్ అందరూ వాళ్ల ఫేవరెట్స్ ని సపోర్ట్ చేస్తూ మిగిలిన వారిని ట్రోలింగ్ చేస్తూ వారి పై మీమ్స్, ఫన్ వీడియోలు వంటివి చేస్తూ మామూలు రచ్చ చేయరు కదా. ఇక ఈ సీజన్ ఏకంగా 20 మంది కాదు కాదు 21 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైంది. ఇందులో కొంతమంది తెలిసిన మొహాలు ఉన్నాయి మరికొన్ని ఎప్పుడూ చూడని మొహాలు ఉన్నాయి. అయితే తెలిసిన మొహాలు గురించి జనాలకు ఎక్కువ విషయాలు తెలుస్తాయి అనే గ్యారెంటీ లేదు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి ఈరోజు రేవంత్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం రండి :

1) ప్రతీ సీజన్ లో ఓ సింగర్ కూడా ఉండేలా బిగ్ బాస్ టీం చూసుకుంటుంది.సీజన్ 3 లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ గా నిలిచాడు. సీజన్ 2 లో సింగర్ గీతా మాధురి రన్నరప్ గా నిలిచింది. సీజన్ 5 లో శ్రీరామచంద్ర టాప్ 3 లో నిలిచాడు. కాబట్టి ఈ ఈ సీజన్లో ఎంట్రీ ఇస్తున్న రేవంత్ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇతను ‘ఇండియన్ ఐడల్ 9’ విన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

2) రేవంత్ పూర్తి పేరు లొల్లా వెంకట రేవంత్ కుమార్ శర్మ. అయితే ఎల్.వి.రేవంత్ గా బాగా పాపులర్ అయ్యాడు.

3) రేవంత్ శ్రీకాకుళం లో పుట్టాడు. విశాఖపట్నంలో పెరిగాడు. వేద పాఠశాలలో చదివాడు. ఫైనల్ గా హైదరాబాద్ లో సెటిల్ అయ్యాడు.

4) రేవంత్ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇతనిది సంగీత నేపథ్యమున్న కుటుంబం కాదు. కానీ అతనికి చిన్నప్పటి నుండి సంగీతం అంటే చాలా ఇష్టం.

5) హైదరాబాద్ కు వచ్చిన కొత్తలో కేటరింగ్ సర్వీస్ సంస్థలో పనిచేశాడు రేవంత్. ఖర్చుల కోసం ఇంట్లో డబ్బులు అడిగి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అలా చేసే వాడు.

6) ‘మహాయజ్ఞం’ అనే చిత్రం ద్వారా సినిమాల్లో పాటలు పాడటం మొదలు పెట్టాడు రేవంత్.

7) రేవంత్ కు ఫస్ట్ బ్రేక్ వచ్చింది మాత్రం అల్లు అర్జున్ ‘బద్రీనాథ్’ చిత్రంతోనే. ఆ మూవీలో ‘అంబ దరి’ ‘చిరంజీవ’ పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

8) ‘బాహుబలి'(ది బిగినింగ్) లో మనోహరి, ‘అర్జున్ రెడ్డి’ లో ‘తెలిసెనే'(బ్రేకప్ సాంగ్) రేవంత్ ఇమేజ్ ను పెంచాయి.

9) ఇండియన్ ఐడల్ 9 ద్వారానే కాకుండా హిందీలో మొదటిసారి ‘సబ్సే బాధా కాలేకర్’ అనే పాటని పాడి అక్కడ కూడా భీభత్సమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు రేవంత్.

10) ఇప్పటివరకు రేవంత్ 200 కి పైగా పాటలు పాడాడు. ఇప్పటికీ పాడుతూనే ఉన్నాడు.

మరి ఇప్పటి వరకు పాటతో అలరించిన రేవంత్.. ‘బిగ్ బాస్ 6’ లో తన ఆటతో ఎంత మంది అభిమానులను సంపాదించుకుంటాడో చూడాలి.

బిగ్ బాస్ 6 కంటెస్టంట్స్ లిస్టు

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus