సినిమా రంగం అంటే మొత్తం పూల పాన్పు.. ఈ రంగంలో పనిచేసే వారికి డబ్బులకు కొదువ ఉండదు అని అంతా అనుకుంటారు. అవన్నీ అపోహలనే చెప్పాలి. ఇక్కడ రాణించాలి అంటే సక్సెస్ ఉండాలి. ఒక సక్సెస్ వస్తే కానీ ఇక్కడ ఎవ్వరూ ఎవ్వరినీ నమ్మరు. అలా అని చెప్పి కోట్లు సంపాదించాక.. స్టార్లు లైఫ్ లో సెట్ అయిపోతారా? అంటే అది వాస్తవం అని చెప్పలేము. ఎందుకంటే సినిమాల్లో సంపాదించిన వాళ్ళు.. తిరిగి సినిమాల్లోనే పెట్టి కోట్లు నష్టపోయిన వారు అనేక మంది ఉన్నారు. ఈ లిస్ట్ లో హీరోయిన్లు కూడా ఉన్నారు అంటే అతిశయోక్తి లేదు. వాళ్ళు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :
1) సావిత్రి :
తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సావిత్రి గారు ‘చిన్నారి పాపలు’ అనే చిత్రాన్ని నిర్మించి భారీగా నష్టపోయారు. అప్పట్లో ఆమె నష్టపోయింది లక్షల్లోనే అయినప్పటికీ ఇప్పటి రోజుల్లో అయితే ఆమె నష్టపోయింది వంద కోట్లు వరకు ఉంటుందని అంచనా..!
2) జయసుధ :
‘కాంచన సీత’ ‘కలికాలం’ ‘అదృష్టం’ ‘వింత కోడళ్ళు’ వంటి చిత్రాలు నిర్మించి ఈమె సంపాదించింది అంతా నష్టపోయింది.
3) భూమిక :
‘తకిట తకిట’ అనే చిత్రాన్ని రూ.2 కోట్ల బడ్జెట్ లో నిర్మించి కోటి పైనే నష్టపోయింది భూమిక.
4) కళ్యాణి :
‘K2K Productions’ అనే బ్యానర్ ను స్థాపించి ఓ ద్విభాషా చిత్రాన్ని రూపొందించింది. ఆ మూవీ వల్ల ఈమె చాలా నష్టపోయింది.
5) విజయశాంతి :
బాలకృష్ణ హీరోగా నటించిన ‘నిప్పురవ్వ’ అనే చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరించి భారీగా నష్టపోయింది విజయశాంతి.
6) మంజుల ఘట్టమనేని :
ఈమె ‘షో’ చిత్రంలో హీరోయిన్ గా నటించడమే కాకుండా ఆ చిత్రాన్ని నిర్మించింది. అటు తర్వాత మహేష్ తో ‘నాని’ చిత్రాన్ని నిర్మించింది. అంతేకాకుండా ‘కావ్యాస్ డైరీస్’ అనే చిత్రాన్ని కూడా నిర్మించింది. ఆ సినిమాలు భారీ నష్టాలను మిగిల్చాయి.
7) రోజా :
తన భర్త సెల్వమణి దర్శకత్వం వహించిన ఓ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించానని.. ఆ సినిమా వల్ల భారీగా నష్టపోయినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది రోజా.
8) శ్రీదేవి :
ఈమె కూడా సహా నిర్మాతగా కొన్ని చిత్రాలను రూపొందించి కోట్లు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి.
9) ఛార్మి :
‘మెహబూబా’ ‘పైసా వసూల్’ తాజాగా ‘లైగర్’ వంటి చిత్రాలను నిర్మించి కోట్లు నష్టపోయింది. ఇంకా సినిమాలు నిర్మిస్తూనే ఉంది.
10) సుప్రియ యార్లగడ్డ :
‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ వంటి చిత్రంలో హీరోయిన్ గా నటించిన ఈ బ్యూటీ.. ఇటీవల రాజ్ తరుణ్ తో ‘అనుభవించు రాజా’ అనే చిత్రాన్ని నిర్మించి భారీగా నష్టపోయింది.
వీళ్ళు మాత్రమే కాదు… కాజల్, తాప్సీ, తమన్నా వంటి స్టార్ హీరోయిన్లు కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. మరి వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.