నయనతార కండీషన్లు!

  • March 25, 2016 / 11:40 AM IST

తమిళంలో సూపర్ హిట్టయిన ‘కత్తి’ చిత్రాన్ని తెలుగులో చిరంజీవి 150వ చిత్రంగా రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా హీరోయిన్ కోసం అన్వేషణ సాగిస్తున్నారు. ఇప్పటికే నయనతార, అనుష్కలను సంప్రదించారని తెలుస్తోంది. అయితే తాను బాహుబలి బిజీలో ఉన్నానని, డేట్స్ కష్టమని అనుష్క తేల్చేసిందని, దాంతో నయనతార ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఆమె పెట్టే కండీషన్లే దర్శక నిర్మాతలకు విసుగు తెప్పిస్తున్నాయి. తమిళ వెర్షన్ కత్తి సినిమాలో హీరోయిన్ చాలా గ్లామరస్ గా కనిపించింది. తెలుగులో కూడా అదే రేంజిలో హీరోయిన్ ను చూపించాలని వినాయక్ ఫిక్స్ అయ్యాడు. బికినీ సీన్ కూడా ఉంటే బావుటుందని వినాయక్ ఆలోచన. ఇదే విషయాన్ని నయనతారకు చెప్పాడట. అయితే నయనతార మాత్రం….బికినీ సీన్లు చేయనని తేల్చి చెప్పినట్లు సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus