లేడీ సూపర్ స్టార్ సమంత(Samantha) తన అభిమానులతో ఓ గుడ్ న్యూస్ షేర్ చేసుకుంది. అవును సమంత, రాజ్ నిడిమోరు దంపతులు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. నిన్న అంటే నవంబర్ 19న సమంతకి డెలివరీ అయ్యింది. మగబిడ్డ జన్మించినట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తమ చిన్నారి చేతిని పట్టుకున్న ఓ అందమైన ఫోటోను షేర్ చేసి ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది సమంత.
బాబుకు ‘దేవ్ నిడిమోరు’ అని పేరు పెడుతున్నట్టు కూడా ప్రకటించింది. ‘మా బ్యూటీఫుల్ బేబీ.. దేవ్ నిడిమోరు. 19.11.2026. మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి” అంటూ సమంత, రాజ్ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. జూన్ 24న హైదరాబాద్‌లో జరిగిన ‘మా ఇంటి బంగారం’ సక్సెస్ సెలబ్రేషన్స్ లో తన ప్రెగ్నెన్సీ వ్యవహారాన్ని బయటపెట్టింది సమంత. ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్‌పై సమంత ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.
రాజ్ నిడిమోరు , వసంత్ మరింగంటి ‘మా ఇంటి బంగారం’ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే అందించగా నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని ‘తస్సాదియ్యా’ పాట షూటింగ్ టైమ్లో తాను గర్భవతి అయినట్టు సమంతకి తెలిసిందట. ఆ సమయంలో షూటింగ్ కి ఇబ్బంది కలగకుండా అలాగే తాను ఇబ్బంది పడకుండా షూటింగ్ పూర్తిచేసినట్టు దర్శకురాలు నందిని రెడ్డి ఓ ఆంగ్ల మీడియాతో చెప్పుకొచ్చారు. డిసెంబర్ 2025లో లింగ భైరవి ఆలయంలో సమంత, రాజ్.. పెళ్లి చేసుకున్నారు.
అదే ఆలయంలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో అదే ఆలయాన్ని సందర్శించి తర్వాత సీమంతం వేడుకను జరుపుకుంది సమంత. భారతీయ సంప్రదాయాల పట్ల తనకున్న అపారమైన గౌరవాన్ని, తరతరాలుగా వస్తున్న ఆచారాలు, మంత్రోచ్ఛారణల శక్తిపై తనకున్న నమ్మకాన్ని ఆ ఫోటోల ద్వారా సమంత వ్యక్తం చేసింది. ఇక సమంత, రాజ్ దంపతులకి మగబిడ్డ పుట్టిన సంగతి తెలుకున్న ఇండస్ట్రీ జనాలు ఆమె ఫాలోవర్స్.. సోషల్ మీడియా ద్వారా తమ బెస్ట్ విషెస్ ను తెలియజేస్తున్నారు.