Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. మలయాళంలో అతను నటించే సినిమాలు సమాంతరంగా తెలుగులో కూడా రిలీజ్ అవుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఏడాదికి రెండు లేదంటే ఒకటి చొప్పున స్ట్రైట్ సినిమా చేసి తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరవుతున్నాడు దుల్కర్ సల్మాన్. అతను నటించిన మరో స్ట్రైట్ తెలుగు మూవీ ‘ఆకాశంలో ఒక తార'(Aakasamlo Oka Tara)

Aakasamlo Oka Tara

పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘గీతా ఆర్ట్స్’ ‘వైజయంతీ మూవీస్’ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సాత్విక వీరవల్లి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. ఇది కూడా పీరియాడిక్ సినిమానే. టీజర్, ట్రైలర్ వంటివి ఆకట్టుకున్నాయి. దీంతో కొంత బజ్ ఏర్పడింది. అందులో భాగంగానే ధియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఒకసారి వాటి వివరాలు అలాగే బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్ ను తెలుసుకుందాం రండి :

నైజాం  2.5 cr
సీడెడ్  0.5 cr
ఆంధ్ర(టోటల్)  2.5 cr
ఏపీ +తెలంగాణ(టోటల్)  5.5 cr (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా  1.5 cr
ఓవర్సీస్  2 cr
వరల్డ్ వైడ్ టోటల్  9 cr (షేర్)

‘ఆకాశంలో ఒక తార’ చిత్రానికి రూ.9 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.10 కోట్లు షేర్ ను రాబట్టాలి. టార్గెట్ అయితే చిన్నదే కానీ.. అన్ సీజన్లో ఇలాంటి క్లాస్ సినిమాలు ధియేటర్లలో బాగా పెర్ఫార్మ్ చేయాలంటే పాజిటివ్ టాక్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది.

అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus