Nikki Galrani: ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన నటి నిక్కీ గల్రానీ?

తమిళ్ స్టార్ ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీలు ప్రేమించుకుని పెద్దల సమక్షంలో పెద్దల అంగీకారంతో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట పెద్దల సమక్షంలో పెళ్లి బంధంతో ఒకటై వారి వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇక పెళ్లి కానటువంటి సెలెబ్రెటీల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రేమ పెళ్లి వార్తలు చక్కర్లు కొడుతుంటాయి. అయితే పెళ్లయిన సెలబ్రిటీల గురించి మాత్రం వారి ప్రెగ్నెన్సీ గురించి వార్తలు రావడం సర్వసాధారణం.

ఈ క్రమంలోనే నటి నిక్కీ గల్రానీ త్వరలోనే తల్లి కాబోతున్నట్టు ఓ వార్త గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.ఈ క్రమంలోనే ఈ వార్తలపై స్పందించిన కొంతమంది అభిమానులు ఏకంగా ఈమెకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. అయితే తన గురించి తన ప్రెగ్నెన్సీ గురించి వస్తున్న వార్తలపై తాజాగా నిక్కీ గల్రానీ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా తన ప్రేగ్నెన్సీ వార్తలకు చెక్ పెట్టారు. ఈ సందర్భంగా ఈమె ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..

నేను ప్రెగ్నెంట్ అంటూ కొందరు ఓ వార్తను ప్రచారం చేస్తున్నారు.ఒక పని చేయండి నేను ప్రెగ్నెంట్ అని చెప్పిన మీరే నా డెలివరీ డేట్ ని కూడా చెప్పేయండి అంటూ చిన్నపాటి అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను ప్రెగ్నెంట్ కాదని,తాను ప్రెగ్నెంట్ అయినప్పుడు ఈ శుభవార్తను మీ అందరితో పంచుకుంటాను. అప్పటివరకు ఇలాంటి వార్తలను నమ్మకండి అంటూ ఈమె వెల్లడించారు. ఇలా ట్విట్టర్ వేదికగా నిక్కీ గల్రానీ ప్రెగ్నెన్సీ వార్తలకు చెక్ పెట్టారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వివాహ బంధంతో ఒక్కటైనటువంటి ఈ జంట ప్రస్తుతం తమ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నారు. ఇక వీరిద్దరూ కలిసి యగవరయినమ్ నా క్కక, మరగద నానయమ్ చిత్రాల్లో నటించారు. అదే సమయంలో వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus