Aha Naa Pellanta Review: ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • రాజ్ తరుణ్ (Hero)
  • శివాని రాజశేఖర్ (Heroine)
  • హర్షవర్ధన్, ఆమని, పోసాని కృష్ణమురళి తదితరులు.. (Cast)
  • సంజీవ్ రెడ్డి (Director)
  • సూర్య రాహుల్ తమడ - సాయిదీప్ రెడ్డి (Producer)
  • జుడా శాండీ (Music)
  • నగేష్ బ్యానిల్ - అస్కర్ అలీ (Cinematography)
  • Release Date : నవంబర్ 17, 2022

ప్రముఖ కంటెంట్ ప్రొడక్షన్ కంపెనీ తమడ సంస్థ రూపొందించిన తాజా వెబ్ సిరీస్ “ఆహ నా పెళ్లంట”. జీ5 యాప్ లో నేటి నుండి స్ట్రీమ్ అవుతున్న ఈ 8 ఎపిసోడ్ల వెబ్ సిరీస్ లో రాజ్ తరుణ్ & శివాని రాజశేఖర్ ముఖ్యపాత్రల్లో నటించగా.. హర్షవర్ధన్, ఆమని, పోసాని కీలకపాత్రలు పోషించారు. అల్లు శిరీష్ తో “ఎ.బి.సి.డి” చిత్రాన్ని తెరకెక్కించిన సంజీవ్ రెడ్డి ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించారు. ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!

కథ: తల్లిదండ్రుల అభీష్టం మేరకు.. చిన్నప్పట్నుంచి అమ్మాయిలకు దూరంగా ఉంటూ వస్తాడు శ్రీను (రాజ్ తరుణ్). ప్రేమ వివాహం చేసుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ, తల్లి కోసం పెద్దలు కుదిర్చిన వివాహానికి సిద్ధమవుతాడు. కట్ చేస్తే.. పెళ్లికూతురు సుధ (దీపాలి శర్మ) మండపం నుంచి తాను ప్రేమించిన అబ్బాయితో మాయమవుతుంది. దాంతో రాజమండ్రి నుంచి హైద్రాబాద్ షిఫ్ట్ అవుతాడు శ్రీను. అక్కడ పరిచయమవుతుంది మహా (శివాని రాజశేఖర్).

మళ్ళీ కట్ చేస్తే.. తన పెళ్లి ఆగిపోవడానికి ముఖ్యకారణం మహేంద్ర (పోసాని) ద్వారా తెలుసుకొని షాక్ అవుతాడు శ్రీను. ఏమిటా కారణం? శ్రీను-మహాల ప్రేమ వ్యవహారం ఎక్కడి దాకా వచ్చింది? అనేది “ఆహ నా పెళ్లంట” కథ.

నటీనటుల పనితీరు: సరదా యువకుడిగా రాజ్ తరుణ్ బాడీ లాంగ్వేజ్ & కామెడీ టైమింగ్ సిరీస్ కి ఒన్నాఫ్ ది మేజర్ హైలైట్స్. ఎమోషనల్ సీన్స్ లో నటుడిగానూ చక్కని పరిణితి ప్రదర్శించాడు. శివాని ప్రతిభను చక్కగా ఎలివేట్ చేసుకుంది. ఆమె స్క్రీన్ ప్రెజన్స్ & మ్యానరిజమ్స్ చూడముచ్చటగా ఉన్నాయి. రాజ్ తరుణ్ & శివానిల కెమిస్ట్రీ కూడా బాగుంది.

తల్లిదండ్రులుగా ఆమని & హర్షవర్ధన్ ల పెర్ఫార్మెన్స్ మంచి కామిక్ రిలీఫ్ ఇచ్చింది. తాగుబోతు రమేష్, గెటప్ శ్రీను, పోసానిల కామెడీ టైమింగ్ & సీన్స్ భలే నవ్విస్తాయి.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు సంజీవ్ రెడ్డి 8 ఎపిసోడ్లుగా కథను బోర్ కొట్టించకుండా నడిపిన విధానం బాగుంది. కామెడీ, సెంటిమెంట్ & ఎమోషన్స్ ను చక్కగా ఎలివేట్ చేశాడు. క్యారెక్టర్స్ ను ఎలివేట్ చేసిన విధానం బాగుంది. రొమాన్స్ ను ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేసేలా కంపోజ్ చేసిన విధానం బాగుంది. అలాగే.. లెక్కకుమిక్కిలి ఆర్టిస్టులను మ్యానేజ్ చేసిన తీరు ప్రశంసనీయం.

తమడ సంస్థ ప్రొడక్షన్ డిజైన్ ప్రొజెక్ట్ & కాన్సెప్ట్ కు తగ్గట్లుగా ఉంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ & డి.ఐలో చూపిన జాగ్రత్త తెరపై కనిపిస్తుంది. జుడా శాండీ సంగీతం & నగేష్ బ్యానిల్ – అస్కర్ అలీల సినిమాటోగ్రఫీ వర్క్ వెబ్ సిరీస్ కు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి.

విశ్లేషణ: కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి హ్యాపీగా బింజ్ వాచ్ చేయగల చక్కని 8 ఎపిసోడ్ల వెబ్ సిరీస్ “ఆహ నా పెళ్లంట”. రాజ్ తరుణ్, శివానిల కెమిస్ట్రీ, హర్షవర్ధన్, పోసాని, తాగుబోతు రమేష్, గెటప్ శ్రీనుల కామెడీ పంచ్ లను మిస్ అవ్వకుండా జీ5 యాప్ ద్వారా ఆస్వాదించండి.

రేటింగ్: 3.5/5

Click Here To Read in ENGLISH

Rating

3.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus