బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి పరిణితి చోప్రా మరి కొద్ది రోజులలో కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈమె ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా అనే వ్యక్తితో కలిసి ఏడడుగులు వేయబోతున్న విషయం మనకు తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట పెద్దల సమక్షంలో మే 13వ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరుపుకున్నారు.
ఈ విధంగా నిశ్చితార్థం జరుపుకున్నటువంటి ఈ జంట పెళ్లి పనులను కూడా మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఈమె తన కాబోయే భర్తతో కలిసి అమృత సర్ లోని గోల్డెన్ టెంపుల్ ను సందర్శించారు.ఈ క్రమంలోనే తన కాబోయే భర్తతో కలిసి గోల్డెన్ టెంపుల్ సందర్శించడమే కాకుండా అక్కడ అన్నదాన సత్రంలోకి వెళ్లి ప్లేట్లు కడుగుతూ సేవ కార్యక్రమంలో కూడా పరిణితి చోప్రా పాల్గొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే పరిణితి చోప్రా (Parineeti Chopra) వరుసకు ప్రియాంక చోప్రాకు సోదరి అవుతారు ఈమె ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఈమె చదువుతున్న సమయంలోనే రాఘవ్ తోపరిచయం ఏర్పడటం ఆ పరిచయం ప్రేమగా మారడం జరిగింది. ఈ క్రమంలోనే వీరి ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ పెళ్లి బంధం వైపు అడుగులు వేస్తున్నారు.త్వరలోనే వీరి వివాహం రాజస్థాన్లోని ఒక పురాతన ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం పెళ్లి పనులలో ఈ జంట ఎంతో బిజీగా ఉన్నారు.
సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!