టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న ప్రగతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినిమాల్లో తల్లి, అత్త,పిన్ని వంటి పాత్రల్లో కొన్ని నిమిషాల పాటు మాత్రమే కనిపించే ఈమె… సోషల్ మీడియాలో మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్లో సందడి చేస్తుంటుంది.కరోనా లాక్ డౌన్ మొదలైనప్పటి నుండీ వరుస పెట్టి డ్యాన్స్ వీడియోలు చేస్తూ వాటిని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ వస్తుంది. వాటికి లక్షల్లో లైకులు రావడం కూడా మనం చూసాం.
అలాగే పలు యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ వచ్చింది ఈ 45 ప్లస్ బ్యూటీ.ప్రస్తుతం ఈమె పలు వెబ్ సిరీస్ లలోనూ అలాగే సీరియల్స్ లో కూడా నటించడానికి రెడీ అయ్యింది. ఇదిలా ఉండగా.. లేటెస్ట్ గా ప్రగతి తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేసింది.ఆమె ఆనందానికి ప్రధాన కారణం వీళ్ళే అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఈ ఫొటోల్లో ప్రగతి కూతురు కూడా ఉండడం విశేషం. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :