Actress Pranitha: భర్తతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ప్రణీత..వైరల్ అవుతున్న ఫోటోలు..!

Advertisement

తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ప్రణీత.. గత ఏడాది అంటే 2021 మే 30న బెంగుళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజు అనే బిజినెస్మెన్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అటు తర్వాత ఈమె సినిమాలకు దూరమైంది. ‘ఏం పిల్లో ఏం పిల్లడో’,’బావ’ ‘అత్తారింటికి దారేది’ ‘బావ’ ‘రభస’.. వంటి చిత్రాల్లో నటించి క్రేజ్ ను సంపాదించుకున్న ప్రణీత… స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లకపోయినా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.

లాక్ డౌన్ టైంలో ఆమె చేసిన సేవా కార్యక్రమాలు ఆమెను రియల్ హీరోయిన్ అనేలా చేశాయి. ఇక ప్రణీతకి జూన్ 10న పండంటి ఆడ పిల్లకు జన్మనిచ్చింది.ఆమె కూతురికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల ప్రణీత తన భర్త నితిన్ తో కలిసి మాల్దీవులకు వెకేషన్ కు వెళ్ళింది. అక్కడ అందమైన సాగర తీరంలో సేద తీరుతుంది ఈ జంట. అంతేకాదు బికినీ ధరించి ప్రణీత కూడా ఓ చేప పిల్లలా మారిపోయింది.

స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతున్న ఫోటోలు,బాత్ టబ్ లో ఉన్న ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. డెలివరీ టైంలో ప్రణీత కొంచెం లావయ్యింది. అయితే ఇప్పుడు తిరిగి సన్నబడింది. ఇదివరకటి లుక్ లోకి మారిపోయింది. ఇక ప్రణీత మాల్దీవ్ ట్రిప్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news