తెలుగులో టీవీ సీరియళ్లు, షోస్ చూసేవారికి ప్రియాంక నల్కారి సుపరిచితమే. ఇటీవల కాలంలో తెలుగు టీవీల్లో పెద్దగా కనిపించని ప్రియాంక…. తమిళంలో వరుసగా సీరియల్స్ చేస్తోంది. ఆ భామ తాజాగా పెళ్లి చేసుకుంది. అది కూడా మన దేశంలో కాదు మలేసియాలో. ఈ మేరకు #JustMarried అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి చేసుకుంటున్న ఫొటోను పోస్ట్ చేసింది ప్రియాంక. గురువారం అంటే మార్చి 23న ప్రియాంక పెళ్లి జరిగింది. అబ్బాయి కూడా ఎవరో కాదు….
తాను ప్రేమించి, ఎంగేజ్మెంట్ చేసుకున్న వ్యక్తే. ఎలాంటి ఆడంబరం లేకుండా సింపుల్‌గా గుడిలో తాళి కట్టించుకుంది ప్రియాంక. ఆమె పెళ్లి ఫొటోలను చూసిన ఫాలోవర్లు వెడ్డింగ్ విషెస్ చెబుతున్నారు. దాంతోపాటు ఇంత నిరాడంబరంగా, ఎవరికీ చెప్పకుండా పెళ్లెందుకు చేసుకున్నారు అనే ప్రశ్నలు కూడా వేస్తున్నారు. ప్రియాంక తన స్టేటస్‌లో పెళ్లి వీడియోను కూడా పోస్ట్ చేసింది. అయితే ప్రియాంక తన కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు సమాచారం.
మలేషియాలోని మురుగన్ ఆలయంలో ప్రియాంక, రాహుల్ పెళ్లి చేసుకున్నారని భోగట్టా. ప్రియాంక పెళ్లి చేసుకున్న వ్యక్తి రాహుల్ వర్మ అనే ఓ వ్యాపారవేత్త అంటున్నారు. తెలుగులో అతను కొన్ని సీరియల్స్‌లో నటించాడని, అప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టిందని చెబుతున్నారు. ఈ క్రమంలో 2018లోనే ఇద్దరి నిశ్చితార్థం చేసుకున్నారట. అయితే ప్రియాంక నటిగా బిజీగా ఉండటంతో పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చింది. ఆ తర్వాత రాహుల్ మలేషియా వెళ్లిపోయాడు. ఇప్పుడు ఈమె కూడా అక్కడకు వెళ్లి పెళ్లి చేసుకుంది.
ప్రస్తుతం ప్రియాంక తెలుగు సీరియల్స్ పెద్దగా కనిపించడం లేదు. అయితే తమిళంలో ‘సన్ టీవీ’లో ‘రోజా’ అనే సీరియల్‌తో మంచి పేరు తెచ్చుకుంది. జీ తమిళ్లో ‘సీతారామన్’ సీరియల్లో నటిస్తోంది. ప్రియాంక స్వస్థలం హైదరాబాద్. ‘అందరి బంధువయా’ అనే సినిమాతో వెండితెరకు వచ్చింది. ఇక్కడ కూడా సరైన అవకాశాలు రాలేదు. తమిళంలో ‘సమ్‌థింగ్ సమ్‌థింగ్’, ‘కాంచన 3’ సినిమాల్లో నటించింది.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?