హీరోయిన్ లక్ష్మీ రాయ్ కు పితృ వియోగం..!

హీరోయిన్ రాయ్‌ లక్ష్మీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈమె అనేక సినిమాల్లో నటించి బోలెడంతమంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె ఇంట ఓ విషాదం చోటుచేసకుంది. వివరాల్లోకి వెళితే… రాయ్ లక్ష్మీ తండ్రి అయిన రామ్‌ రాయ్‌ మృతి చెందారు. స్వయంగా రాయ్ లక్ష్మీనే ఈ విషయాన్ని తెలుపుతూ ఓ ఎమోషనల్ ట్వీట్ చేసింది.దాంతో పాటు తన తండ్రితో దిగిన ఫోటోని కూడా జతచేసింది. ఇక ఈ పోస్ట్ ద్వారా రాయ్ లక్ష్మీ స్పందిస్తూ… “డాడీ ఐ మిస్ యూ.. నేను ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను.

మిమ్మల్ని బ్రతికించుకోలేకపోయాను. నా జీవితంలో ఈ లోటు ఎప్పటికీ తీరదు. మీరు లేరని చెబుతుంటే.. నా గుండె పగిలిపోతున్నట్టు ఉంది. నన్ను మీరు ప్రేమించినంతగా ఇంకెవ్వరూ ప్రేమించలేదు. మిమ్మల్ని కాపాడుకోవాలని నేను చాలా ప్రయత్నించాను.. కానీ రక్షించుకోలేకపోయాను. నన్ను క్షమించండి నాన్న. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నాకు ధైర్యం చెప్పడానికి మీరు పక్కన లేరు అంటే నేను తట్టుకోలేకపోతున్నాను. మీ కూతురుగా పుట్టడం నా అదృష్టం. ఎప్పుడూ మీరు నాకో మాట చెప్పేవారు. మనం ఒంటరిగా ఉన్నా ధైర్యంగా ఉండాలి అని..!మీరు ఆ మాట ఎందుకు చెప్పేవారో నాకు ఇప్పుడు అర్ధమైంది.

మీరైతే నొప్పి, బాధలేని ప్రశాంతమైన చోటులో ఉన్నారు. మీరు లేరు అంటేనే నా మనసు ఒప్పుకోవడం లేదు. మీ దీవెనలు నాకు ఎప్పుడూ ఉంటాయని.. నన్ను ముందుకు నడిపిస్తారని’ కోరుకుంటున్నాను. నన్ను నమ్మి మీరు కోరిన కోర్కెను నేను కచ్చితంగా నెరవేరుస్తాను. బంగారం లాంటి మనసున్న వ్యక్తి గుండె కొట్టుకోవడం ఆగిపోయింది.నన్ను అంధకారంలోకి నెట్టేసింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. మిమ్మల్ని మేము చాలా మిస్‌ అవుతున్నాము. ఐ లవ్‌ యూ” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.


Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus