Raashi Khanna: కొత్త సినిమాలకు రాశి ఓకే చెప్పకపోవడం వెనుక కారణాలివే!

  • February 17, 2023 / 05:39 PM IST

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన రాశిఖన్నాకు స్టార్ హీరోయిన్ కు అవసరమైన లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నప్పటికీ ఆమె మాత్రం స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోకపోవడం ఫ్యాన్స్ ను బాధ పెడుతున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలోకి రాశిఖన్నా ఎంట్రీ ఇచ్చి పదేళ్లు అయినా ఆమెకు ఆశించిన రేంజ్ లో గుర్తింపు దక్కకపోవడం ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది. మరోవైపు రాశిఖన్నా పెళ్లి చేసుకోనున్నారంటూ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

ఈ వార్తలు తన దృష్టికి రావడంతో రాశిఖన్నా ఈ ప్రచారం గురించి స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని ఆమె అన్నారు. కొన్నేళ్ల క్రితం వరకు ఛబ్బీ లుక్ లో కనిపించిన ఈ బ్యూటీ ప్రస్తుతం బరువు తగ్గి స్లిమ్ లుక్ లో కనిపిస్తున్నారు. పక్కా కమర్షియల్ ఫ్లాప్ తర్వాత తెలుగులో రాశిఖన్నాకు ఆశించిన రేంజ్ లో ఆఫర్లు రావడం లేదు.

ఫార్జి అనే వెబ్ సిరీస్ లో మేఘ రోల్ లో నటించిన రాశి ఖన్నా బాలీవుడ్ లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు. తాను సినిమాలకు బ్రేక్ ఇవ్వలేదని కొత్త సినిమా కథలను వింటున్నానని ఆమె చెబుతున్నారు. త్వరలో తను హీరోయిన్ గా తెరకెక్కుతున్న కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటనలు వస్తాయని ఆమె కామెంట్లు చేశారు. నేను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని రాశిఖన్నా వెల్లడించారు.

నేను నా పనిని ఎంతగానో ప్రేమిస్తున్నానని పని చేయడాన్ని అదృష్టంగా ఫీలవుతున్నానని ఆమె పేర్కొన్నారు. నేను చేసే పనిని ఆనందంగా చేస్తున్నానని నా పనిని నేను ప్రేమిస్తున్నానని ఇలా జరగడాన్ని అదృష్టంగా ఫీలవుతానని ఆమె తెలిపారు. రాశిఖన్నా రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా ఆమె కెరీర్ పరంగా మరిన్ని సక్సెస్ లను అందుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus