Rashmi Gautam: బిగ్ బాస్ కు రష్మీ పెట్టిన షరతు తెలిస్తే షాకవ్వాల్సిందే!

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్7 కోసం రష్మీ గౌతమ్ ను తీసుకోవాలని ఈ షో నిర్వాహకులు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్6 ఫ్లాప్ కావడంతో బిగ్ బాస్ సీజన్7 కచ్చితంగా సక్సెస్ సాధించేలా ఈ షో నిర్వాహకులు అడుగులు వేస్తున్నారు. అయితే బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి రష్మీ గౌతమ్ అంగీకరించిందని అయితే కొన్ని షరతులు మాత్రం విధించిందని సమాచారం అందుతోంది. వారానికి 8 లక్షల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తే బిగ్ బాస్ షోకు రావడానికి తనకు అభ్యంతరం లేదని రష్మీ చెప్పినట్టు తెలుస్తోంది.

రష్మీ బిగ్ బాస్ కు ఓకే చెబితే ఈ షోపై క్రేజ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఈ రేంజ్ లో రష్మీ పారితోషికం అందుకుంటే ఆమెకు సులువుగా కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ దక్కే ఛాన్స్ ఉంటుంది. బిగ్ బాస్ షో రూల్స్ ప్రకారం హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని నెలల పాటు రష్మీ ఇతర ఛానెళ్లలో షోలు చేయకూడదు. రష్మీ గౌతమ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా బుల్లితెర షోలకు అనసూయ దూరం కావడంతో రష్మీకి డిమాండ్ పెరుగుతోంది.

సుమ హవా తగ్గడం, అనసూయ సినిమాలకే పరిమితం కావడంతో రష్మీ దూకుడుకు ఇప్పట్లో బ్రేకులు వేయడం సులువు కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. రష్మీ ప్రస్తుతం ఎపిసోడ్ కు లక్ష రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారు. రష్మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎన్నో రూమర్లు వినిపిస్తున్నా వాటి గురించి స్పందించే ఆలోచన కూడా ఆమెకు లేదని తెలుస్తోంది.

రష్మీ యాంకర్ గా తన రేంజ్ ను మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఈటీవీ ఛానల్ కు పరిమితమైన రష్మీ ఇతర ఛానెళ్ల నుంచి వస్తున్న ఆఫర్లకు ప్రాధాన్యత ఇస్తారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus