Rashmika: పంది మాంసం తినడం వైన్ తాగడం అంటే ఇష్టమంటున్న రష్మిక?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యారు. నటిగా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం ఇతర భాష చిత్రాలలో కూడా నటిస్తూ సందడి చేశారు. ప్రస్తుతం కన్నడ తెలుగు తమిళ హిందీ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా ఈమె తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన ఆహారపు అలవాట్ల గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రష్మిక తనకు ఇష్టమైనటువంటి ఆహారం గురించి తెలియజేశారు. తమ సామాజిక వర్గంలో పంది మాంసాన్ని చాలా సాంప్రదాయకమైన వంటగా భావిస్తారని రష్మిక తెలిపారు.ఇలా పంది మాంసాన్ని సాంప్రదాయ వంటకంగా భావించే మేమంతా పంది మాంసాన్ని తినడానికి ఎక్కువగా ఇష్టపడతామని తెలిపారు.

ముఖ్యంగా పంది మాంసాన్ని నిప్పులపై కాల్చుకొని తినడం చాలా ఇష్టమని ఈమె తెలియజేశారు. అదేవిధంగా వైన్ తాగడానికి కూడా ఎంతో ఇష్టపడతానని రష్మిక తన ఆహారపు అలవాట్లు తెలియజేశారు. తాము ఇంట్లోనే స్వయంగా వైన్ తయారు చేసుకుంటామని ఇలా ఇంట్లో తయారు చేసుకున్న వైన్ తరచూ తాగుతూ ఉంటామని ఈమె తెలిపారు.

ఈ విధంగా రష్మిక (Rashmika) పంది మాంసం తింటూ వైన్ తాగడం తనకు చాలా ఇష్టమని చెప్పడంతో ఈ వార్తలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే రెయిన్ బో, యానిమల్, పుష్ప 2 వంటి సినిమాల షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus