Roja: రోజా బాలీవుడ్‌లో న‌టించిన సినిమా ఎంటో. తెలిస్తే షాక్ అవుతారు..!

టాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరోయిన్లలో ఒకరైన రోజా ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. హీరోయిన్గా ఎన్నో చిత్రాలలో నటించి మంచి క్రేజ్ అందుకున్న రోజా ఆ తర్వాత పొలిటికల్ పరంగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఏపీ పర్యటక మంత్రిగా కొనసాగుతోంది.. నటిగా తెలుగు తమిళంలో ఎన్నో చిత్రాలలో నటించింది రోజా.. కన్నడ మలయాళంలో కూడా పలు సినిమాలలో నటించి మెప్పించడం జరిగింది. అయితే రోజా కూడా కేవలం ఒకే ఒక్క హిందీ సినిమాలో నటించిందట.

వాటి గురించి తెలుసుకుందాం. రోజా మాతృభాష తెలుగే కాదు తమిళ్ కన్నడ మలయాళం ,హిందీ వంటి భాషలలో తనదైన ముద్ర వేసుకోవడం జరిగింది. ప్రస్తుతం వైసిపి పార్టీ నుంచి రెండు సార్లు అసెంబ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది ఇందులో విజయాన్ని అందుకుంది రోజా. రోజా కెరియర్లో కేవలం ఒక్క బాలీవుడ్ సినిమాలో నటించింది. ప్రేమ తపస్సు అనే సినిమా ద్వారా తెలుగు తెరకు అడుగుపెట్టిన రోజా (Roja) సర్పయాగం సినిమాతో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.

ఆ తర్వాత భైరవద్వీపం సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్గా క్రేజీ అందుకుంది. విజయశాంతి తర్వాత లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో ఎక్కువ నటించిన హీరోయిన్గా పేరుపొందింది రోజా. హీరోయిన్గా ఫెడవుట్ కావడంతో పొలిటికల్ వైపుగా ఎంట్రీ ఇచ్చి మొదటిసారి టిడిపి తరఫున పోటీ చేసి ఓడిపోయింది. ఆ తర్వాత వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చి రెండు సార్లు ఘనవిజయాన్ని అందుకుంది. డైరెక్టర్ సెల్వమణిని వివాహం చేసుకుంది.

వీరికి ఇద్దరు పిల్లలు. రోజా నటించిన హిందీ సినిమా విషయానికి వస్తే మహేష్ భట్ డైరెక్షన్లో వచ్చిన ది జెంటిల్మెన్ అనే సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మాణంలో చిరంజీవి హీరోగా నటించారు. అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయిందని సమాచారం.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags