నటి రోజా పరిచయం అవసరం లేని పేరు. ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన ఈమె ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో మంత్రిగా కొనసాగుతున్నారు. రాజకీయాలలోకి వచ్చిన అనంతరం బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నటువంటి రోజా ప్రస్తుతం మంత్రి పదవి రావడంతో బుల్లితెర కార్యక్రమాలకు కూడా దూరమై పూర్తిగా రాజకీయాలలో కొనసాగుతున్నారు. ఇలా సినిమాల పరంగా రాజకీయాల పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తనకు ఏమాత్రం విరామ సమయం దొరికిన తన కుటుంబంతో గడపడానికి రోజా ఆసక్తి చూపుతారు.
ఈ క్రమంలోనే రోజా ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియా వెకేషన్ లో ఉన్నారు.ఆస్ట్రేలియాలో కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నటువంటి ఈమె అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా రోజా సోషల్ మీడియా వేదికగా తన కూతురు అన్షు మాలిక గురించి ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. అయితే తన కూతురు పుట్టిన రోజు కావడంతో తన కూతురు ఫోటోని షేర్ చేస్తున్న ఈమె తన గురించి ఒక ఎమోషనల్ నోట్ రాశారు.
ఈ సందర్భంగా రోజా పోస్ట్ చేస్తూ… డియర్ అన్షు నువ్వు నాకు కూతురివే కాదు… నాకు బెస్ట్ ఫ్రెండ్ కూడా నన్ను ఇంతలా అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు. పుట్టినరోజు శుభాకాంక్షలు డియర్ అంటూ ఈమె తన కూతురు గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ విధంగా కూతురు గురించి రోజా ఎమోషనల్ అవుతూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
రోజా కూతురు అన్షు మాలిక టాలెంట్ గురించి ఎప్పటికప్పుడు రోజా సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఉంటారు. ఇంత చిన్న వయసులోనే ఎంతో టాలెంట్ ఉన్నటువంటి ఈమె తన తల్లిలాగే సేవా కార్యక్రమాలను చేస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున ప్రశంసలను కూడా అందుకున్నారు. ఇక ఈమె కూడా త్వరలోనే తల్లి బాటలో ఇండస్ట్రీలోకి రాబోతుందని వార్తలు వస్తున్నాయి .
Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!